Vivo X Fold 6 : వివో ఫ్యాన్స్‌కు పండగే.. ఫస్ట్ సేల్‌లోనే రూ.26 వేల డిస్కౌంట్‌తో దుమ్మురేపుతున్న ఫోన్!
Vivo X Fold 6 : వివో ఫ్లాగ్షిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వివో ఎక్స్ ఫోల్డ్ 6ను గత వారం భారత మార్కెట్లో లాంచ్ చేయగా ఇప్పుడు మార్కెట్లో అమ్మకానికి వచ్చింది. ఫోన్ ధర ఎంతంటే?
- Sreehari A
- Published on- October 14, 2026 / 03:13 PM IST
Vivo X Fold 6
- వివో ఎక్స్ ఫోల్డ్ 6పై బిగ్ డిస్కౌంట్లు, మరెన్నో ఆఫర్లు
- 8.02-అంగుళాల 2K+ ఎల్టీపీఓ అమోల్డ్ డిస్ప్లే
- 200MP ప్రైమరీ కెమెరా, 6,900mAh బ్యాటరీ సెటప్
Vivo X Fold 6 : వివో లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్.. ఫ్లాగ్షిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వివో ఎక్స్ ఫోల్డ్ 6 ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఫస్ట్ సేల్ కూడా మొదలైంది. అన్నింటికన్నా ముఖ్యంగా, ఈ ఫోన్‌పై కంపెనీ బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ.26,400 తగ్గింపు, ఫ్లాట్ రూ.22వేలు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. మీరు ఈ ఫోన్‌ను కొనాలని అనుకుంటే ఇదే బెస్ట్ టైమ్.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 ఆఫర్లు, ధర, ఇతర ఫీచర్లపై ఓసారి పరిశీలిద్దాం..
వివో X ఫోల్డ్ 6 ధర ఎంతంటే? :
వివో ఎక్స్ ఫోల్డ్ 6 అమ్మకాలు ప్రారంభమయ్యాయి. వినియోగదారులు వివో అధికారిక సైట్‌తో పాటు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. వివో ఎక్స్ ఫోల్డ్ 6 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.2,19,999గా ఉంది.
Read Also : OnePlus Nord 6 : పండగ చేస్కోండి.. వన్‌ప్లస్ నార్డ్ 6పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
లాంచ్ ఆఫర్ కింద హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్లపై రూ.26,400 డిస్కౌంట్ పొందవచ్చు. ఆ తర్వాత ధర రూ.1,93,599 అవుతుంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయడంపై ఫ్లాట్ రూ.22వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.
వివో ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
వివో ఎక్స్ ఫోల్డ్ 6లో 2504×2312 పిక్సెల్స్ రిజల్యూషన్, 1Hz-120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 8.02-అంగుళాల 2K+ ఎల్టీపీఓ అమోల్డ్ డిస్ప్లే ఉంది. ఇందులో 2528×1120 పిక్సెల్స్ రిజల్యూషన్, 1Hz-120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ టాప్ బ్రైట్నెస్, 6.51-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ కవర్ డిస్ప్లే కూడా ఉంది. ఎక్స్ ఫోల్డ్ 6కు మీడియాటెక్ డైమెన్సిటీ 9500 సూపర్ ఎడిషన్ చిప్సెట్ పవర్ అందిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 7 ఫోల్డ్‌పై రన్ అవుతుంది.
వివో ఎక్స్ ఫోల్డ్ 6 బ్యాక్ కెమెరా సెటప్‌లో OIS సపోర్ట్‌తో 200MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఇందులో 6,900mAh బ్యాటరీ ఉంది. 80W ఫ్లాష్ ఛార్జ్ 40W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ IPX8, IPX9, IP5X రేటింగ్‌లతో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది.
