×
Ad

Vivo X100 Pro : ఔట్‌స్టాండింగ్ డీల్ భయ్యా.. వివో X100 ప్రో అతి చౌకైన ధరకే.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Vivo X100 Pro : వివో కొత్త ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. వివో X100 ప్రో అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. అమెజాన్‌లో ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Vivo X100 Pro

Vivo X100 Pro : మీరు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? వివో X100 ప్రో ధర భారీగా తగ్గింది. ఇప్పుడు అమెజాన్‌లో రూ.30వేల కన్నా ఎక్కువ డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా కేవలం రూ.59,999కే కొనేసుకోవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ పవర్‌ఫుల్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్, ప్రీమియం (Vivo X100 Pro) కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ కలిగి ఉంది. అద్భుతమైన కెమెరా సెటప్, అదిరిపోయే డిజైన్‌తో వివో X100 ప్రో కొనేసుకోవచ్చు. ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్‌ అసలు మిస్ చేసుకోవద్దు.

అమెజాన్‌లో వివో X100 ప్రో 5జీ ధర :
ప్రస్తుతం అధికారిక వివో స్టోర్‌లో రూ.96వేల విలువైన వివో ఎక్స్100 ప్రో ప్రస్తుతం రూ.59,990కి అమ్ముడవుతోంది. డిస్కౌంట్ ధర రూ.37వేలు అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ.1,500 సేవ్ చేసుకోవచ్చు. తద్వారా ధర రూ.58,490కి తగ్గుతుంది. ప్రస్తుత స్మార్ట్‌ఫోన్లలో కొనుగోలుదారులు గరిష్టంగా రూ.44,150 ఎక్స్ఛేంజ్ వాల్యూతో ధర మరింత తగ్గింపు పొందవచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఎంచుకున్న బ్యాంక్ కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తుంది.

Read Also : Realme C63 5G : ఫ్లిప్‌కార్ట్‌లో మరో కొత్త సేల్.. ఈ రియల్‌మి C63 5G ఫోన్ జస్ట్ రూ. 8,999 మాత్రమే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

వివో X100 ప్రో 5G స్పెసిఫికేషన్లు :
వివో X100 ప్రో 5G పవర్, ప్రీమియం రెండింటిని కలిగి ఉంది. అద్భుతమైన 6.78-అంగుళాల ఎల్టీపీఓ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంది. అల్ట్రా-స్మూత్ నావిగేషన్, క్లియర్ కలర్స్, గేమింగ్, స్ట్రీమింగ్ లేదా బ్రౌజింగ్‌కు అద్భుతమైన విజువల్స్‌ అందిస్తుంది.

ఈ వివో ఫోన్ ఫన్‌టచ్ OS14తో ఆండ్రాయిడ్ 14 లేయర్‌లతో రన్ అవుతుంది. అత్యాధునిక మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్‌సెట్, స్పీడ్, సామర్థ్యాన్ని అందిస్తుంది. 16GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీతో ఈ కోర్ హార్డ్‌వేర్, డివైజ్ భారీ మల్టీ టాస్కింగ్, భారీ అప్లికేషన్‌లతో తగినంత స్టోరేజీని అందిస్తుంది.

వివో X100 ప్రో ప్రొఫెషనల్-గ్రేడ్ కెమెరా సెటప్‌ ఉంది. 50MP సోనీ IMX989 ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, మరో 50MP టెలిఫోటో సెన్సార్‌తో వస్తుంది. ఈ కాన్ఫిగరేషన్ అన్ని లైటింగ్, జూమ్ లెవల్స్‌లో క్రిస్టల్-క్లియర్ ఆప్షన్లు అందిస్తుంది. ఈ వివో ఫోన్ 100W ఫ్లాష్‌ఛార్జ్ సపోర్టుతో 5,400mAh బ్యాటరీతో వస్తుంది. సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్ లాంగ్ టైమ్ వస్తుంది.