Vivo X200 Price : ఇది కదా డిస్కౌంట్.. ఈ వివో X200 ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్.. ఇంత తక్కువ ధరలో మళ్లీ దొరకదు!

Vivo X200 Price : వివో ఫోన్ తక్కువ ధరలో కొనాలంటే ఇదే బెస్ట్ టైమ్. ఫ్లిప్‌కార్ట్‌లో వివో X200 ఎన్నడూ లేనంత తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

1/8
Vivo X200 Price : కొత్త వివో ఫోన్ కొంటున్నారా? భారీ తగ్గింపు ధరకే వివో X200 ఫోన్ లభిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వివో ఫోన్ బ్యాంక్ ఆఫర్లతో డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోసం 3 జైస్-ట్యూన్డ్ కెమెరా సెటప్, ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌ కూడా ఉంది.
2/8
మొత్తంగా ఈ వివో ఫోన్ ధర రూ. 60వేల లోపే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో వివో X200 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
3/8
ఫ్లిప్‌కార్ట్‌లో వివో X200 డీల్ : భారత మార్కెట్లో వివో X200 ఫోన్ రూ. 65,999 ధరతో లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ వివో ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 61,999 ధరకు అందుబాటులో ఉంది. రూ. 4వేలు నేరుగా డిస్కౌంట్ పొందవచ్చు.
4/8
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో రూ. 3,100 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ధర రూ. 58,899కి తగ్గుతుంది. నెలకు కేవలం రూ. 2,180 చొప్పుున 36 నెలల ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది.
5/8
వివో X200 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : వివో X200 ఫోన్ లోపల డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ ఉంటుంది. 16GB వరకు ర్యామ్, 1TB వరకు సపోర్ట్ ఇచ్చే UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. డిజైన్ విషయానికి వస్తే.. ఫ్రంట్, బ్యాక్ గ్లాస్‌తో అల్యూమినియం ఫ్రేమ్ ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69 రేటింగ్‌ అందిస్తుంది.
6/8
HDR10+ సపోర్ట్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లే బ్రైట్‌నెస్ గరిష్టంగా 4,500 నిట్స్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,800mAh బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్-ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.
7/8
ఈ డివైజ్‌కు 4 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ అందుతాయి. 50MP ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ లెన్స్, 50MP అల్ట్రావైడ్ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఉంది.
8/8
వివో ఎక్స్200 కొనాలా? వద్దా? : ఫొటోగ్రఫీ ప్రియుల కోసం జైస్ ట్యూనింగ్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ అందిస్తుంది. ఒప్పో పైండ్ X8 ప్రో, అల్ట్రా, వన్‌ప్లస్ 13/13ఎస్, షావోమీ 15/15 అల్ట్రా వంటి ఇతర ఫ్లాగ్‌షిప్ ఫోన్లతో పోలిస్తే బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు.