Vivo X200 Pro : వారెవ్వా.. ఇది కదా ఆఫర్.. 200MP కెమెరాతో వివో ప్రో ఫోన్ చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Vivo X200 Pro : వివో నుంచి అద్భుతమైన ఆఫర్.. వివో ఎక్స్200 ప్రో అతి తక్కువ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వివో ఫోన్ రూ. 8వేల కన్నా తగ్గింపు ధరకే లభ్యమవుతోంది. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- May 8, 2026 / 01:06 PM IST
Vivo X200 Pro : వివో లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. వివో ఎక్స్200 ప్రో భారీ తగ్గింపుతో లభిస్తోంది. వివో X200 ప్రో కొనాలని చూస్తుంటే.. ఇదే బెస్ట్ ఫోన్. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
వివో ఎక్స్200 ప్రో బ్యాక్ సైడ్ ఎఫ్/1.57 అపర్చర్ OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ సైడ్ ఎఫ్/2.0 అపర్చర్‌తో 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. వివో x200 ప్రోపై డీల్స్, ఆఫర్లు ఓసారి పరిశీలిద్దాం..
వివో X200 ప్రో ధర ఆఫర్లు : వివో ఎక్స్200 ప్రో ఫోన్ 16GB + 512GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 86,899 ధరకు లిస్ట్ అయింది. అయితే, డిసెంబర్ 2024లో రూ. 94,999 ధరకు లాంచ్ అయింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే ధర రూ. 70 వేల వరకు తగ్గించుకోవచ్చు.
అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది ప్రస్తుత వర్కింగ్ కండిషన్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. బ్యాంక్ ఆఫర్‌లో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే.. రూ. 300 ఫ్లాట్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఆ తర్వాత ధర రూ. 86,599 అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ ధర కన్నా సుమారు రూ. 8,400 తక్కువకే లభిస్తుంది.
వివో X200 ప్రో స్పెసిఫికేషన్లు : వివో X200 ప్రో ఫోన్ 6.78-అంగుళాల 8T ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 2800x1260 పిక్సెల్స్, రిఫ్రెష్ రేట్ 0.1-120Hz టాప్ బ్రైట్‌నెస్ 4500 నిట్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 3nm ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ OS 15పై రన్ అవుతుంది. వివో X200 ప్రో 6000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 90W వైర్డ్ 30W వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69+IP68 రేటింగ్ అందిస్తుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. వివో X200 ప్రోలో బ్యాక్ సైడ్ ఎఫ్/1.57 అపర్చర్, OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP సెకండరీ కెమెరా, ఎఫ్/2.67 అపర్చర్ OIS సపోర్ట్‌తో 200MP కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది.
వివో X200 ప్రో ఫోన్ 162.36 మిమీ పొడవు, 75.95 మిమీ వెడల్పు, 8.20 మిమీ మందం, 228 గ్రాముల బరువు ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్ సిమ్ సపోర్ట్, 5G SA/NSA, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-సి పోర్ట్, NFC సపోర్ట్ ఉన్నాయి.
