Telugu » Technology » Vivo X200 Pro Now Available For Lowest Price Ever On Amazon How To Grab This Deal Sh
Vivo X200 Pro : వివో ఫ్యాన్స్ మీకోసమే.. ఈ వివో X200 ప్రోపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్, అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
Vivo X200 Pro : కొత్త వివో ఫోన్ కావాలా? అమెజాన్‌లో ఈ వివో X200 ప్రో ఫోన్ సరసమైన ధరకే లభిస్తోంది. ఎప్పుడూ లేనంతగా అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?
Vivo X200 Pro : వివో లవర్స్ డోంట్ మిస్. వివో పాపులర్ ప్రో ఫోన్ ధర భారీగా తగ్గింది. కొత్త వివో ఫోన్ కొనాలని చూస్తుంటే ఈ డీల్ అసలు వదులుకోవద్దు. ప్రస్తుతం వివో X200 ప్రో ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వివో X200 ప్రోను అతి తక్కువ ధరకే అందిస్తోంది.
2/7
ఈ ఫోన్ అసలు ధర రూ.94,999 ఉండగా తగ్గింపు తర్వాత ప్రస్తుతం అమెజాన్‌లో రూ.80వేల కన్నా తక్కువ ధరకు అమ్ముడవుతోంది. ఈ ఫోన్ జీస్-బ్యాక్డ్ కెమెరా, ఫ్లాగ్‌షిప్ మీడియాటెక్ చిప్, ఆకట్టుకునే డిస్‌ప్లేతో వస్తుంది. అమెజాన్‌లో వివో X200 ప్రో ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
3/7
అమెజాన్‌లో వివో X200 ప్రో ధర ఎంతంటే? : ప్రస్తుతం, వివో X200 ప్రో ఫోన్ 16GB ర్యామ్, 512GB వేరియంట్ రూ.79,999కు లిస్ట్ అయింది. ఏకంగా ధర రూ.15వేలు తగ్గింది. కస్టమర్లు రూ.1,5వేలు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు, దాంతో అసలు ధర నుంచి రూ.78వేల కన్నా తక్కువ ధరకే లభ్యమవుతుంది. ఈ వివో X200 ప్రో ఫోన్ ధర దాదాపు వివో X300 ధరకు దగ్గరగా ఉంటుంది. బ్యాంక్ కార్డులతో నెలకు రూ.2,813 నుంచి ఈఎంఐ ఆప్షన్లు కూడా ఎంచుకోవచ్చు.
4/7
ఆసక్తిగల కస్టమర్లు తమ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుని రూ.42వేల వరకు ఆదా చేసుకోవచ్చు. కానీ, ఫోన్ వర్కింగ్ కండిషన్, కొనుగోలు తేదీ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీరు అదనంగా చెల్లించడం ద్వారా ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా పొందవచ్చు.
5/7
వివో X200 ప్రో కొనాలా వద్దా? : ఈ వివో ప్రో మోడల్ అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. వెనిల్లా ట్రిమ్ మోడల్స్ అందుబాటు ధరలో ఉన్నాయి. అమెజాన్‌లో 50MP మెయిన్, 200MP టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రావైడ్, 32MP ఫ్రంట్ కెమెరాతో ప్రో వేరియంట్‌ను అందిస్తోంది. అద్భుతమైన నేచురల్ విజువల్స్, పోర్ట్రెయిట్‌లు లో లైటింగ్ ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు.
6/7
6.78-అంగుళాల ఎల్టపీఓ అమోల్డ్ ప్యానెల్, 4,500-నిట్ ప్యానెల్, 3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌తో వస్తుంది. గేమ్‌ప్లే, స్ట్రీమింగ్ సెషన్ కు అద్భుతంగా ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ విషయంలో డోంట్ వర్రీ. ఎందుకంటే.. ఈ వివో బ్రాండ్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీని అందిస్తుంది.
7/7
ఈ వివో ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్ అందిస్తుంది. అలాగే 3D అల్ట్రాసోనిక్ సింగిల్-పాయింట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందిస్తుంది. మొత్తం మీద దాదాపు రూ. 78వేల ధరలో ఈ వివో ప్రో ఫోన్ ఇంటికి తెచ్చుకోవచ్చు.