Vivo X200T 5G : ఈ వివో 5G ఫోన్ ఎగబడి కొనేది ఇందుకే.. ఇంత కాస్టలీ ఫోన్ చీప్‌గా వస్తుంటే వదులుతారా భయ్యా!
Vivo X200T 5G : ఈ వివో 5జీ ఫోన్ చాలా కాస్టలీ గురూ.. అయినా వివో ఫోన్ కొనేందుకు ఎగబడుతుంటారు. 25 శాతం డిస్కౌంట్ ధరకే వస్తుంటే ఎవరూ కొనకుండా ఉంటారు.. ఇంతకీ ధర ఎంత తగ్గిందో తెలుసా?
- Sreehari A
- Published On : April 1, 2026 / 07:04 PM IST
Vivo X200T 5G
- వివో ఎక్స్200టీ 5జీ ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది
- వివో X200టీ 5జీ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలు
- అసలు ధర రూ. 79,999 నుంచి 25శాతం తగ్గింపుతో రూ. 59,999కే
Vivo X200T 5G : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? 2026లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కేటగిరీలో వివో X200T 5జీ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఫ్లాగ్‌షిప్-లెవల్ పర్ఫార్మెన్స్ కోరుకునే యూజర్లకు తక్కువ ధరకే అందుబాటులో ఉంది.
ఈ వివో ఫోన్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్, జైస్ కెమెరా సిస్టమ్, వైడ్ రేంజ్ బ్యాటరీ సామర్థ్యంతో గేమర్‌లకు, కంటెంట్ క్రియేటర్‌లకు అదిరిపోయే పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, టాప్ రేంజ్ పర్పార్మెన్స్, ఆధునిక ఫీచర్లతో ఫ్లాగ్‌షిప్ కిల్లర్ అని చెప్పొచ్చు. ఈ వివో X200టీ 5జీ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి..
ధర, ఆఫర్ వివరాలు :
వివో X200T 5జీ ఫోన్ రూ. 79,999తో వచ్చింది. కానీ, ఇప్పుడు 25శాతం భారీ తగ్గింపుతో రూ. 59,999కే అందుబాటులో ఉంది. అదనపు బ్యాంక్ ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. పూర్తి ఆఫర్లు, ఇతర డిస్కౌంట్లు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..
ZEISS కెమెరా సిస్టమ్ :
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ 50MP జైస్-ట్యూన్డ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు సపోర్టు ఇచ్చే సోనీ IMX921 మెయిన్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌ను అందిస్తుంది. 100x హైపర్‌జూమ్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి.
ఈ సెటప్‌తో అద్భుతమైన విజువల్ క్వాలిటీతో కచ్చితమైన ఫోటోలు, జూమ్ ఫొటోలు, వైడ్ వైడ్-యాంగిల్ ఫొటోలను తీయవచ్చు. 32MP ఫ్రంట్ కెమెరా, హై-డెఫినిషన్ వీడియో కాల్స్ కోసం కచ్చితమైన సెల్ఫీలు తీసుకోవచ్చు.
అల్ట్రా బ్రైట్‌నెస్‌తో అమోల్డ్ డిస్‌ప్లే :
6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఆకట్టుకునే కంటెంట్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K రిజల్యూషన్ అందిస్తుంది. ఈ డిస్‌ప్లే HDR10+ టెక్నాలజీతో వస్తుంది. గరిష్టంగా 5000 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. గేమింగ్, స్ట్రీమింగ్, రోజువారీ టాస్కులకు అద్భుతంగా ఉంటుంది.
అద్భుతమైన పర్ఫార్మెన్స్ :
డైమెన్సిటీ 9400+తో అదిరిపోయే పర్ఫార్మెన్స్, 3nm ఆర్కిటెక్చర్, మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్, గేమింగ్, మల్టీటాస్కింగ్ అందిస్తుంది. ఈ వివో ఫోన్ టెంపరేచర్ పరంగా 4.5K వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అందిస్తుంది.
ఫాస్ట్ ఛార్జింగ్‌తో బ్యాటరీ సపోర్టు :
వివో X200T 5జీలో 6200mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. ఎక్కువసేపు వాడినా 24 గంటలకు పైగా ఛార్జింగ్ అందిస్తుంది. 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ వల్ల ఫాస్ట్ రీఛార్జ్ అవుతుంది. వివో ఈ 5జీ ఫోన్ రూ. 59,999 ధరకే అడ్వాన్స్ కెమెరా, అద్భుతమైన బ్యాటరీ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. గేమింగ్, ఫోటోగ్రఫీకి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
