Vivo X200T
Vivo X200T Sale : వివో లవర్స్ మీకోసమే.. కొత్త వివో X200T ఫోన్ ప్రీ బుకింగ్ మొదలైంది. ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం నెలకు రూ. 3056తో వివో ఫోన్ సొంతం చేసుకోవచ్చు. వివో X200T 5జీ ఫోన్ ఇటీవలే భారత మార్కెట్లో జనవరి 27, 2026న ప్రీమియం సబ్-ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌గా లాంచ్ అయింది.
ఫిబ్రవరి 4, 2026 నుంచి స్టెల్లార్ బ్లాక్, సీసైడ్ లిలాక్ కలర్ ఆప్షన్‌లలో అమ్మకానికి రానుంది. ఒకవేళ మీరు ఒకేసారి ఫుల్ అమౌంట్ చెల్లించకపోతే.. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఫోన్‌ను ప్రీ-బుక్ చేసుకోవచ్చు. నెలకు కేవలం రూ. 3,056 చెల్లిస్తే సరిపోతుంది.
ఈ ఫోన్ పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమన్షిటీ 9400+ చిప్‌సెట్‌తో వస్తుంది. 50MP సోనీ సెన్సార్‌తో జీఈఐఎస్ఎస్-బ్రాండెడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అందిస్తుంది. భారీ 6200mAh బ్యాటరీ ప్యాక్‌తో అమర్చి ఉంటుంది. అన్ని స్పెసిఫికేషన్‌లు, ధర, తగ్గింపు, ఇతర వివరాలపై ఓసారి లుక్కేయండి..
ధర, డిస్కౌంట్, ప్రీ-బుకింగ్ వివరాలు :
భారత మార్కెట్లో వివో ఎక్స్200టీ 5జీ ఫోన్ 12GB ర్యామ్, ప్లస్ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 79,999కి లాచ్ అయింది. కానీ, 25శాతం తగ్గింపుతో దాదాపు రూ. 20వేలు తగ్గింపు పొందింది. మీరు ఈ వివో ఫోన్ కేవలం రూ. 59,999కి సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సూపర్ కాయిన్స్‌తో రూ. 2వేలు సేవ్ చేయొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంక్ డిస్కౌంట్లతో రూ. 7,900 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
మీకు SBI, Axis, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే.. మీరు రూ. 5,515 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మీకు ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే.. రూ. 8,140 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. వివో ఫోన్ ఒకేసారి ఫుల్ పేమెంట్ చేయలేకుంటే నెలకు రూ. 3,056 ఈఎంఐతో ఫోన్ ప్రీ-బుక్ చేసుకోవచ్చు.
కెమెరా సెటప్, బ్యాటరీ ప్యాక్ :
వివో X200T 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ జీఈఐఎస్ఎస్ బ్రాండెడ్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50MP సోనీ IMX921 మెయిన్ సెన్సార్ + 50MP శాంసంగ్ JN1 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP సోనీ IMX882 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.
అయితే ఫ్రంట్ సైడ్ 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. అలాగే, ఈ వివో ఫోన్‌లో 6200mAh బ్యాటరీ కూడా ఉంది. 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టు అందిస్తుంది. 35 గంటల యూట్యూబ్ ప్లేబ్యాక్, 6 గంటల వీడియో రికార్డింగ్ అందిస్తుంది.
డిస్‌ప్లే, డిజైన్ :
వివో X200T 5జీ ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అద్భుతమైన అవుట్‌డోర్ విజిబిలిటీని ఇస్తుంది. ప్యానెల్ స్కాట్ జెన్సేషన్ కోర్ డిస్‌ప్లే ప్రొటెక్షన్ అందిస్తుంది. ఫోన్ అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్‌తో ప్రీమియం గ్లాస్ బాడీ అందిస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్‌లతో వస్తుంది.
పర్ఫార్మెన్స్, చిప్‌సెట్ :
వివో X200T 5జీ ఫోన్ 3nm ప్రాసెస్‌పై మీడియాటెక్ డైమన్షిటీ 9400+ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. గేమింగ్ యూజర్లకు బెస్ట్ ఫోన్. ఇమ్మోర్టలి-జీ925 జీపీయూ, 12GB LPDDR5X ర్యామ్ అందిస్తుంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత (OriginOS6) అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది. వివో 5 మెయిన్ OS అప్ డేట్స్, 7 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది. గేమింగ్, వీడియో ఎడిటింగ్ కోసం 4.5K లిక్విడ్ కూలింగ్ వేపర్ చాంబర్ కూడా ఉంది.