Vivo X300 FE Discount : రూ.10 వేలకుపైగా తగ్గింపు.. 6500mAh బ్యాటరీతో వివో X300 FE అదిరిపోయే డీల్!
Vivo X300 FE Discount : వివో X300 ఎఫ్ఈపై అమెజాన్‌లో భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. HDFC, ICICI, Axis బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.10,800 వరకు తగ్గింపు పొందవచ్చు. 6500mAh బ్యాటరీ, 50MP కెమెరాలు, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ ఫీచర్లు ఇవే..
- Sreehari A
- Published on- November 9, 2026 / 05:53 PM IST
Vivo X300 FE Discount
- కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై ఖతర్నాక్ డిస్కౌంట్
- 6500mAh బ్యాటరీ, 50MP కెమెరాలు..
- రూ.89,999 ఫోన్‌పై రూ.10,800 వరకు తగ్గింపు..
- అమెజాన్‌లో వివో X300 FE కొనేందుకు ఇదే మంచి ఛాన్స్
Vivo X300 FE Discount : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? ముఖ్యంగా చేతిలో ఈజీగా పట్టే కాంపాక్ట్ ఫోన్ కావాలనుకునే వారికి ఇదే బెస్ట్ ఆఫర్.. ప్రీమియం ఫీచర్లతో వివో X300 FEపై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఏకంగా రూ.10,800 వరకు ఆదా చేసుకోవచ్చు.. ఇంతకీ ఈ వివో ఫోన్ డిస్కౌంట్ ధరకే ఎలా సొంతం చేసుకోవాలో చూద్దాం..
వివో X300 ఎఫ్ఈ ఆఫర్ వివరాలివే :
ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.89,999. అయితే, అమెజాన్‌లో HDFC, ICICI లేదా యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో పేమెంట్ చేస్తే గరిష్ఠంగా రూ.10,800 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఫోన్ కొనుగోలు ధర మరింత తగ్గుతుంది. అలాగే, పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా అదనపు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అయితే, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ వాల్యూ, నిబంధనలకు లోబడి ఉంటాయి..
వివో X300 ఎఫ్ఈ ఫీచర్లు :
ఈ ఫోన్‌లో 6.31 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఇచ్చారు. 2640 x 1216 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ ఉంది. వీడియోలు, గేమ్స్ ఆడేందుకు అద్భుతమైన అనుభూతి లభిస్తుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్, అడ్రినో 829 జీపీయూ ఉన్నాయి.
బ్యాటరీ విషయానికి వస్తే..
6,500mAh భారీ బ్యాటరీ స్పెషల్ అట్రాక్షన్ చెప్పుకోవచ్చు. దీనికి 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కెమెరాల విషయానికొస్తే.. బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫొటో కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 50MP కెమెరా అందించారు..
కొనడం బెటరా? :
చిన్న సైజులో ప్రీమియం ఫోన్, మంచి కెమెరాలు, భారీ బ్యాటరీ కోరుకునే వారికి వివో X300 ఎఫ్ఈ బెస్ట్ ఆప్షన్ కావచ్చు. అయితే, లాంగ్ టైమ్ గేమింగ్ లేదా హెవీ టాస్కులు చేసినప్పుడు ఫోన్ వేడెక్కే అవకాశం ఉంది.. మొత్తం మీద ప్రస్తుత బ్యాంక్ ఆఫర్లతో ఈ ఫోన్ కొనాలనుకునే వారికి మంచి డీల్..
