Vivo X300 FE Price Cut : సూపర్ ఆఫర్ మావా.. ఈ వివో X300 FE ఫోన్ భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో ధర జస్ట్..!

Vivo X300 FE Price Cut : అమెజాన్‌లో వివో X300 ఎఫ్ఈ తగ్గింపు ధరకు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ ద్వారా ధర రూ. 80వేల కన్నా తక్కువకే పొందవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలో చూద్దాం..

Vivo X300 FE Price Cut

  • అమెజాన్ గ్రేట్ ఇండిన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు
  • వివో ఎక్స్300 ఎఫ్ఈ ధరపై భారీ డిస్కౌంట్
  • రూ.80వేల లోపు ధరకే ఎలా కొనాలంటే?

Vivo X300 FE Price Cut : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో పండుగ సీజన్ సమయంలో అమెజాన్ స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు మంచి ప్రీమియం కెమెరా ఫోన్ చూస్తుంటే ఇది మీకోసమే.. వివో X300 ఎఫ్ఈ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

రూ. 80వేల లోపు ధరకే ఎలా? :
వివో X300 ఎఫ్ఈ (12GB + 256GB) వేరియంట్ ధర రూ. 1,19,999 నుంచి తగ్గి ప్రస్తుతం రూ. 94,999గా ఉంది. మీరు నాన్-ఈఎంఐ లావాదేవీలపై సీబీసీసీ లేని ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌తో ఫ్లాట్ రూ. 11,400 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ పొందవచ్చు. అంతేకాదు.. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను రూ. 46,700 వరకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్లన్నీ కలిపి ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను రూ. 80వేల లోపు ధరకే పొందవచ్చు.

Read Also : Cyber Fraud Alert : వాట్సాప్‌లో ‘నో’ అని రిప్లై ఇస్తే ఖాతా ఖాళీ! సైబర్‌ నేరగాళ్ల కొత్త స్కెచ్‌పై సీపీ సజ్జనర్ హెచ్చరిక

వివో X300 ఎఫ్ఈ స్పెసిఫికేషన్లు :
వివో X300 ఎఫ్ఈలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.31-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ ఉంది. అదనంగా, ఈ స్క్రీన్ HDR10+ సపోర్ట్‌, నెట్‌ఫ్లిక్స్‌లో HDR ప్లేబ్యాక్‌ కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌ ఉపయోగించారు. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ కోసం అడ్రినో 829 జీపీయూ అందిస్తుంది. 6,500mAh బ్యాటరీ ఉంది. ఛార్జింగ్ ఆప్షన్‌లలో 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ ఉన్నాయి.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే..
వివో X300 FEలో ట్రిపుల్ బ్యాక్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 50MP టెలిఫోటో షూటర్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో 50MP షూటర్ ఉంది.

ముఖ్యంగా, ఈ స్మార్ట్‌ఫోన్ ఫొటోగ్రఫీ కోసం అనేక ఇంటిగ్రేటెడ్ ఏఐ ఆధారిత ఫీచర్లతో వస్తుంది. ఇందులో ఫొటోల నుంచి అనవసరమైన అబ్జెక్టులు రిమూవ్ చేయడం, పోర్ట్రెయిట్ షాట్‌లను అప్ గ్రేడ్ చేయడం, సీన్ బట్టి కెమెరా సెట్టింగ్‌లను ఆటోమేటిక్‌గా ఆప్టిమైజ్ చేయడం వంటి టూల్స్ ఉన్నాయి. స్ట్రీట్ ఫొటోగ్రఫీ మోడ్ కూడా ఉంది. షాట్‌లను కంపోజ్ చేయడం, ఫ్రేమ్ కోసం ఏఐని వాడొచ్చు.