Vivo X300 FE Price : వివో లవర్స్‌కు బిగ్ షాక్.. వివో X300 FE ధర రూ.10 వేలు పెంపు.. ఐఫోన్ 17 కన్నా ఖరీదే!
Vivo X300 FE Price : వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్ X300 FE ధరను రూ.10వేలు పెంచింది. ఈ వివో ఫోన్ ఇప్పుడు ఐఫోన్ 17 కన్నా చాలా ఖరీదు.. ఇంతకీ కొత్త ధర ఎంతో తెలుసా?
- Sreehari A
- Published on- August 12, 2026 / 05:12 PM IST
Vivo X300 FE Price
- వివో ఎక్స్300 ఎఫ్ఈ ప్రారంభ ధర రూ.79,999
- గత జూన్ నెలలో రూ. 7వేలు పెంపు
- ఆగస్టులో మరో రూ. 3వేలు పెరిగిన ఫోన్ ధర
Vivo X300 FE Price : వివో ఫ్యాన్స్ మీకోసమే.. వివో కొత్త X300 FE ఫోన్ ధర మళ్లీ పెరిగింది. గత మేలో లాంచ్ అయిన ఫ్లాగ్‌షిప్ ఫోన్ X300 FE ధరను వివో రూ.10వేల వరకు పెంచింది. ఈ ధర పెంపుతో ఇప్పుడు ఈ ఫోన్ ఐఫోన్ 17 కన్నా అత్యంత ఖరీదైనదిగా మారింది. కంపెనీ ధర పెంచడం ఇది రెండోసారి. గతంలో ఇదే ఫోన్ ధరను రూ.7వేలు పెంచగా ఇప్పుడు మరో రూ.3వేలు పెంచింది. పూర్తి ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.
వివో X300 ఎఫ్ఈ కొత్త ధర ఎంతంటే? :
ఈ వివో ఫోన్ రూ.79,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. గత జూన్‌లో ఈ ఫోన్ ధర రూ.7,000 పెరిగింది. దాంతో మొత్తం వివో X300 FE ఫోన్ (Vivo X300 FE Price) ధర రూ.86,999కి చేరింది. ఇప్పుడు వివో కంపెనీ ఈ ఫోన్ ధరను మరో రూ.3వేలు పెంచింది.
ఈ వివో ఫోన్ ఇప్పుడు రూ.89,999 ప్రారంభ ధరతో వస్తుంది. గత ఏడాదిలో రూ.82,999 ప్రారంభ ధరతో వచ్చిన ఐఫోన్ 17 కన్నా ధర ఎక్కువే.. రూ.89,999కి లాంచ్ అయిన టాప్ వేరియంట్ ఇప్పుడు రూ.99,999కి లభిస్తోంది.
Read Also : Bank Lending Rates : ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకున్నారా? ఇక మీ EMI మోతే! భారీగా పెరిగిన వడ్డీ రేట్లు
వివో X300 ఎఫ్ఈ ఫీచర్లు :
ఈ వివో ఫోన్ 6.32-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ టాప్ బ్రైట్‌నెస్ 5000 నిట్స్ వరకు ఉంటుంది. ఈ ఫోన్ ఆలివ్, పర్పుల్, బ్లాక్ అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్‌తో వస్తుంది. వాటర్, డస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో 6,500mAh బ్యాటరీ ఉంది. 80W వైర్డ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6పై రన్ అవుతుంది.
వివో ఎక్స్300 ఎఫ్ఈ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 50MP సెకండరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది.
