Vivo X300 FE Review : ఫొటోగ్రఫీ కింగ్ వచ్చేసింది.. ట్రిపుల్ 50MP, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వివో దుమ్మురేపుతోంది!

Vivo X300 FE Review : భారత మార్కెట్లోకి వివో నుంచి సరికొత్త X300 FE ఫోన్ వచ్చేసింది. ట్రిపుల్ 50ఎంపీ రియర్ కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది. ధర, ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.

Vivo X300 FE Review

  • ఈ వివో FE ఫోన్‌లో 6,500mAh బ్యాటరీ సెటప్
  • 120Hz రిఫ్రెష్ రేట్‌, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఆప్షన్

Vivo X300 FE Review : వివో లవర్స్ ఎగిరిగంతేసే వార్త.. భారత మార్కెట్లోకి వివో నుంచి వివో X300 ఎఫ్ఈ ఫోన్ లాంచ్ అయింది. ఈ వివో ఫోన్‌ కంపెనీ గతంలో మార్చిలో చైనా మార్కెట్‌లో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

ఉదాహరణకు.. ఇందులో ప్రాసెసర్‌గా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 కూడా ఉంది. 6,500mAh బ్యాటరీ అద్భుతంగా ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా (Vivo X300 FE Review) ఉంది. కంపెనీ బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరాతో పాటు, అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ పెరిస్కోప్ లెన్స్‌ అందించింది. భారత మార్కెట్లో వివో ఎక్స్ 300 ఎఫ్ఈ ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్‌లో వివో X300 ఎఫ్ఈ ధర, ఆఫర్లు :
భారత మార్కెట్లో వివో X300 ఎఫ్ఈ ధర 12GB+256GB వేరియంట్ ధర రూ. 79,999 నుంచి ప్రారంభమవుతుంది. 12GB+512GB వేరియంట్ ధర రూ. 89,999కు లభిస్తుంది. జైస్ టెలిఫోటో ఎక్స్‌టెండర్ జెన్2 ధర రూ. 15,999కు పొందవచ్చు.

టెలిఫోటో ఎక్స్‌టెండర్ యాక్సెసరీస్ కిట్‌ను రూ. 3,999కి కొనుగోలు చేయవచ్చు. ఎక్స్‌టెండర్, యాక్సెసరీస్ కిట్ ప్రత్యేక ధర రూ. 95,997కు పొందవచ్చు. ఈ వివో ఫోన్ అర్బన్ ఆలివ్, లైలాక్ పర్పుల్, నోయిర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Read Also : TVS iQube S : ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మాస్ రేంజ్, క్లాస్ ఫీచర్స్.. సింగిల్ ఛార్జ్‌పై 175 కి.మీ దూసుకెళ్తుంది.. ధర జస్ట్..!

వివో ఫోన్ కొనుగోలుతో రూ. 5వేల అప్‌గ్రేడ్ బోనస్‌ను కూడా పొందవచ్చు. ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ వంటి ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అధికారిక వెబ్‌సైట్, మెయిన్ రిటైల్ స్టోర్‌లతో పాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. వివో ఫోన్ కోసం అడ్వాన్స్ బుకింగ్‌లు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ వివో ఫోన్ సేల్ మే 14న ప్రారంభం కానుంది.

వివో X300 ఎఫ్ఈ స్పెసిఫికేషన్లు :
వివో X300 ఎఫ్ఈ 120Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందించే 6.31-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ ఫుల్ HD+ (1,216×2,640 పిక్సెల్స్) అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌తో రన్ అవుతుంది.

ఈ వివో ఫోన్ బ్యాక్ సైడ్ జైస్ (Zeiss)వారి ట్రిపుల్ కెమెరా సెటప్‌ అందిస్తుంది. ఇందులో ఎఫ్/1.57 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో స్పెషల్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ మోడ్, ఏఐ క్రియేటివ్ మోడ్ వంటి అడ్వాన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ వివో ఫోన్‌లో 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 6,500mAh బ్యాటరీ ఉంది. 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. బైపాస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. కంపెనీ 5 ఏళ్ల ఓఎస్ అప్‌డేట్‌లు, 7 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని హామీ ఇచ్చింది.

కనెక్టివిటీ ఆప్షన్‌లలో 4G, 5G, Wi-Fi, బ్లూటూత్, NFC, GPS, BeiDou ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్ వంటి అవసరమైన అన్ని సెన్సార్లు ఉన్నాయి.