Vivo X300 Pro : అమెజాన్ సూపర్ ఆఫర్ భయ్యా.. ఈ వివో ఫోన్ ఇంత తక్కువకు మళ్లీ దొరకదు.. ఎంత తగ్గిందో తెలుసా?
Vivo X300 Pro : వివో ఫోన్ ఆఫర్ అదిరింది.. వివో ఎక్స్300 ప్రో ధర భారీగా తగ్గింది. అమెజాన్‌లో వివో ఎక్స్300 ప్రోపై ఏకంగా రూ. 12వేలు డిస్కౌంట్ లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Updated on- September 21, 2026 / 06:05 PM IST
Vivo X300 Pro
- వివో X300 ప్రో అధికారిక ధర రూ. 1,19,999
- 90W ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్
- 6,510mAh బ్యాటరీ, 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే
- బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ. 10వేలు తగ్గింపు
Vivo X300 Pro : మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటే ఇదే బెస్ట్ టైమ్.. వివో X300 ప్రో ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 12వేల కన్నా భారీ తగ్గింపుతో లభిస్తోంది. రూ. 1,19,999 ధరలో వివో ఎక్స్300 ప్రో మోడల్ 6.78-అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్, 200MP టెలిఫోటో కెమెరాతో సహా హై-ఎండ్ స్పెసిఫికేషన్‌లతో వస్తుంది. కీలక స్పెసిఫికేషన్‌లతో వివో X300 ప్రో డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం..
వివో X300 ప్రో డీల్ :
వివో X300 ప్రో అధికారిక ధర రూ. 1,19,999కు లభిస్తుంది. అమెజాన్‌లో ఈ ఫోన్ కొంటే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై (Vivo X300 Pro) రూ. 12,999 తగ్గింపు పొందవచ్చు. ఒకవేళ మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేకున్నా ఐసీఐసీఐ బ్యాంక్ లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 10వేలు తగ్గింపు పొందవచ్చు. మరింత ఆదా కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
వివో X300 ప్రో స్పెసిఫికేషన్లు :
వివో X300 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,510mAh బ్యాటరీ ఉంది. ఫ్రంట్ సైడ్ 2800 × 1260 (1.5K+) రిజల్యూషన్, 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఈ ప్యానెల్ HDR10+, డాల్బీ విజన్, నెట్‌ఫ్లిక్స్ HDR, SGS లో-బ్లూ లైట్, టీయూవీ రైన్‌ల్యాండ్ ఫ్లికర్-ఫ్రీకి కూడా సపోర్ట్ చేస్తుంది.
ఫొటోగ్రఫీ కోసం వివో X300 ప్రోలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OISతో 50MP సోనీ LYT-828 ప్రైమరీ లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ JN1 లెన్స్, 3.5x ఆప్టికల్ జూమ్, OIS, f/2.67 అపర్చర్‌తో 200MP HPB టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‌లో ఫ్రంట్ సైడ్ 50MP కెమెరా ఉంది.
