Vivo X300 Series : వివో లవర్స్ గెట్ రెడీ.. కొత్త వివో X300 సిరీస్ వచ్చేస్తోంది.. స్పెసిఫికేషన్లు లీక్.. ధర ముందే తెలిసిందోచ్!

Vivo X300 Series : రాబోయే వివో X300 సిరీస్ అధికారికంగా లాంచ్ కాకముందే ఆసక్తి నెలకొంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో నుంచి వివో X300 అల్ట్రా, వివో X300 ఎఫ్ఈ రెండూ మే 6న భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. మే 14న సేల్స్ ప్రారంభమవుతాయి.

1/7
Vivo X300 Series : వివో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రాబోయే వివో X300 సిరీస్ అధికారికంగా లాంచ్ కాకముందే సంచలనం సృష్టిస్తోంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో నుంచి వివో X300 అల్ట్రా, వివో X300 ఎఫ్ఈ రెండూ మే 6న భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని, మే 14న సేల్స్ ప్రారంభమవుతాయని ధృవీకరించింది. కంపెనీ ఇప్పటికే టీజర్‌లను లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్ల కీలక ఫీచర్లకు సంబంధించి వివరాలు లీక్ అయ్యాయి. వివో X300 అల్ట్రా, వివో X300 ఎఫ్ఈ వివరాలపై ఓసారి లుక్కేయండి.
2/7
వివో X300 ఎఫ్ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : చైనీస్ టెక్ కంపెనీ వివో ఎక్స్300 ఎఫ్ఈని కొత్త గ్రీన్ కలర్ వేరియంట్‌లో టీజ్ చేసింది. భారత మార్కెట్లో మాత్రమే స్పెషల్ కలర్ ఆప్షన్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో వస్తుందని టీజర్ సూచిస్తుంది.
3/7
గ్లోబల్ వేరియంట్‌కు అనుగుణంగా ఉంటుంది. వివో ఎక్స్300 ఎఫ్ఈలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.31-అంగుళాల 1.5K ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. 90W వైర్డ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీ సపోర్టు ఇస్తుంది.
4/7
ఈ ఫోన్ లైలాక్ పర్పుల్, నోయిర్ బ్లాక్, భారత్ కోసం స్పెషల్ అర్బన్ ఆలివ్ కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుందని అంచనా. కెమెరాల విషయానికి వస్తే.. ఈ వివో ఫోన్లు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ షూటర్ ఉంటాయి. వీటన్నింటికీ ZEISS ఆప్టిక్స్ అమర్చి ఉండనున్నాయి.
5/7
వివో X300 అల్ట్రా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : వివో X300 అల్ట్రాలో 144Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్‌తో 6.82-అంగుళాల 2K ఎల్టీపీఓ, అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుందని అంచనా. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ఉంటుంది. 16GB ర్యామ్, 1TB స్టోరేజ్ అందిస్తుందని భావిస్తున్నారు. ఇందులో 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,600mAh బ్యాటరీ కూడా ఉంటుందని అంచనా.
6/7
కెమెరా విషయానికొస్తే.. ఈ అల్ట్రా మోడల్‌లో 200MP ప్రైమరీ సెన్సార్, 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, ZEISS ద్వారా ట్యూన్ 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉండవచ్చు. ఆసక్తికరంగా, వివో X300 ఎఫ్ఈ, వివో ఎక్స్300 అల్ట్రా రెండూ ఎక్స్‌ట్రనల్ టెలిఫోటో ఎక్స్‌టెండర్‌కు సపోర్టు ఇస్తాయని భావిస్తున్నారు. వివో స్పెషల్ కెమెరా ఫీచర్‌గా రాబోతుంది.
7/7
భారత్‌లో వివో X300 అల్ట్రా, X300 ఎఫ్ఈ ధర : నివేదికల ప్రకారం.. భారత మార్కెట్లో వివో X300 అల్ట్రా ధర సుమారు రూ. 159,999 ఉండగా, వివో X300 FE ధర సుమారు రూ. 79,999 నుంచి ప్రారంభం కావచ్చు. ఈ రెండు ఫోన్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వివో అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌తో సహా పలు ప్లాట్‌ఫారమ్‌లలో లభ్యం కానున్నాయి.