Vivo X300 Ultra : వివో ఫ్యాన్స్ గెట్ రెడీ.. కొత్త వివో X300 అల్ట్రా వచ్చేస్తోందోచ్.. లాంచ్ డేట్, ధర, కీలక ఫీచర్లు లీక్..
Vivo X300 Ultra : వివో కొత్త ఫోన్ వస్తోంది. వివో ప్రీమియం మోడల్ ఎక్స్300 అల్ట్రా ఫోన్ అతి త్వరలో లాంచ్ కానుంది. కీలక ఫీచర్లు, ధర వివరాలు రివీల్ అయ్యాయి..
- Sreehari A
- Published On : April 13, 2026 / 07:20 PM IST
Vivo X300 Ultra
- మే 7న వివో X300 అల్ట్రా లాంచ్ అయ్యే అవకాశం, మే 14 నుంచి సేల్ అంచనా
- 200MP మెయిన్ కెమెరా, 200MP పెరిస్కోప్ కెమెరా, 7,000mAh బ్యాటరీ
- భారత్ అంచనా ధర రూ. 1,20,999 నుంచి రూ. 1,30,999 మధ్య ఉండొచ్చు
Vivo X300 Ultra : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? వివో X300, వివో X300 ప్రోతో పాటు మరో అల్ట్రా ఫోన్ కూడా వస్తోంది. వివో ఫ్యామన్స్ కోసం ఈ ప్రీమియం ఆప్షన్ లాంచ్ కానుంది. నివేదికల ప్రకారం.. వివో అతి త్వరలోనే వివో X300 అల్ట్రాను భారత మార్కెట్‌లో రిలీజ్ చేయనుంది.
అద్భుతమైన కెమెరా, పర్ఫార్మెన్స్, డిజైన్‌తో రానుంది. వివో ఇంకా X300 అల్ట్రా (Vivo X300 Ultra) వివరాలను వెరిఫై చేయలేదు. కానీ, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో రివీల్ అయ్యాయి. వివో అల్ట్రా ఫోన్ లాంచ్ డేట్ ఎప్పుడు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వివో X300 అల్ట్రా భారత్ లాంచ్ తేదీ (అంచనా) :
లేటెస్ట్ లీక్ ప్రకారం.. వివో X300 అల్ట్రా మే 7న లాంచ్ కానుంది. ఈ వివో ఫోన్ మే 14 నుంచి అమ్మకానికి రానుందని సమాచారం. అయితే, కంపెనీ ఇంకా ఈ ఫోన్ వివరాలను టీజ్ చేయలేదు. అతి త్వరలోనే టీజర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.
వివో X300 అల్ట్రా స్పెసిఫికేషన్లు :
రాబోయే వివో X300 అల్ట్రాలో 6.82-అంగుళాల 2K ఎల్టీపీఓ అమోల్డ్ ప్యానెల్ ఉంటుంది. 1Hz–144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.
16GB వరకు LPDDR5X ర్యామ్, 1TB UFS 4.0 స్టోరేజ్‌తో పాటు స్పెషల్ వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను అందించే అవకాశం ఉంది. వివో X300 అల్ట్రాలో 7,000mAh సెమీ-సాలిడ్ స్టేట్ బ్యాటరీతో పాటు 100W ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ ఉండవచ్చు. IP68/IP69-రేటెడ్ బాడీతో రావొచ్చు.
కెమెరా విషయానికొస్తే.. ఈ వివో ఫోన్ భారీ ఒక-అంగుళాల సెన్సార్, OISతో 200MP ప్రైమరీ సెన్సార్ (సోనీ LYT-901) ఉండవచ్చు. 3.7x ఆప్టికల్ జూమ్, 100x వరకు డిజిటల్ జూమ్‌తో 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కూడా ఉండొచ్చు.
50MP అల్ట్రావైడ్ కెమెరా, 4K సపోర్ట్‌తో 50MP ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత స్కిన్‌తో పాటు 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, శాటిలైట్ కనెక్టివిటీ (ఎంపిక చేసిన మోడళ్లలో), Wi-Fi 7, బ్లూటూత్ 5.4 వంటి మరిన్ని ఆప్షన్లు ఉండొచ్చు.
భారత్‌లో వివో X300 అల్ట్రా ధర (అంచనా) :
భారత మార్కెట్లో వివో X300 అల్ట్రా ధర రూ. 1,20,999 నుంచి రూ. 1,30,999 మధ్య ఉండవచ్చు. పూర్తి ధరల వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
