Vivo X300 Ultra Price : వివో క్రేజే వేరబ్బా.. 200MP కెమెరాతో వివో X300 అల్ట్రా భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

Vivo X300 Ultra Price : వివో X300 అల్ట్రా ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 8వేల తగ్గింపుతో లభిస్తోంది. చూసేందుకు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లాగే ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్, 200MP జైస్ కెమెరాలు, 6600mAh బ్యాటరీ, ప్రీమియం 144Hz అమోలెడ్ డిస్‌ప్లే ఉన్నాయి.

Vivo X300 Ultra Price ( Image Credit : AI )

  • వివో ఎక్స్300 అల్ట్రా ధర భారీగా తగ్గింది
  • 200MP కెమెరా, 6600mAh బ్యాటరీ
  • ప్రీమియం 144Hz అమోలెడ్ డిస్‌ప్లే
  • స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్
  • వివో ఎక్స్ 300 అల్ట్రా ధర రూ. 75,999

Vivo X300 Ultra Price : వివో లవర్స్ కోసం భారీ ఆఫర్.. కొత్త వివో ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే.. భారీ కెమెరా అవుట్‌పుట్, ఫాస్ట్ హార్డ్‌వేర్, భారీ బ్యాటరీతో ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఈ డీల్ అసలు వదులుకోవద్దు. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం వివో X300 అల్ట్రాపై భారీ తగ్గింపును అందిస్తోంది. అదనపు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

వివో X300 అల్ట్రా అసలు ధర రూ. 83,999గా ఉండగా, ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా ఈ వివో ఫోన్ (Vivo X300 Ultra Price) ధర రూ. 8వేలు తగ్గింది. తద్వారా వివో ఎక్స్ 300 అల్ట్రా ధర రూ. 75,999గా ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్, జైస్ (ZEISS) అసిస్టెంట్ కెమెరాలు, 144Hz అమోలెడ్ డిస్‌ప్లే వంటి మెయిన్ స్పెసిఫికేషన్లతో వస్తుంది. ఈ వివో ఫోన్ ప్రస్తుతం ఆకర్షణీయమైన ప్రీమియం ఆండ్రాయిడ్ ఆప్షన్లలో వస్తుంది.

వివో X300 అల్ట్రా ఫ్లిప్‌కార్ట్ ధర, ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా వివో ఎక్స్300 అల్ట్రా ధరను రూ. 83,999 నుంచి రూ. 75,999కి తగ్గింది. ఈ నేరుగా తగ్గింపుతో పాటు కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ ద్వారా భారీగా ఆదా చేసుకోవచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లను కూడా ఎంచుకోవచ్చు.

పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే :
వివో X300 అల్ట్రా లోపల, క్వాల్‌కామ్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో పాటు 16GB వరకు ర్యామ్ 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ చిప్‌సెట్ భారీ గేమింగ్, ఏఐ ఆధారిత టాస్కులు, స్మూత్ మల్టీటాస్కింగ్ మొత్తం మీద ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

Read Also : EPFO Update : మీ PF ఖాతా లాక్ అయిందా? టెన్షన్ వద్దు.. ఇలా అన్‌లాక్ చేసేయండి!

ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్రంట్ సైడ్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో భారీ 6.82-అంగుళాల 2K ఎల్టీపీఓ అమోల్డ్ స్క్రీన్‌తో వస్తుంది. ఇదే ప్యానెల్ HDR10+ డాల్బీ విజన్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. మొత్తంగా, క్లియర్ కలర్లు, గేమ్‌లు, స్ట్రీమింగ్ కోసం అద్భుతంగా ఉంటుంది.

కెమెరా, బ్యాటరీ ఆప్షన్లు :
వివో X300 అల్ట్రాలో ఫోటోగ్రఫీ స్పెషల్ అట్రాక్షన్. ప్రీమియం లుక్ కనిపిస్తుంది. ఇందులో ZEISS-ఆధారిత ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ఫ్రంట్ సైడ్ భారీ 200MP సోనీ LYT-901 ప్రైమరీ సెన్సార్ ఉంది. ఇందులో OIS సపోర్ట్ అందిస్తుంది.

200MP ప్రైమరీ కెమెరా
200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్
3.7x ఆప్టికల్ జూమ్‌తో సహా
50MP అల్ట్రా-వైడ్ కెమెరా

సెల్ఫీల కోసం వివో 50MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 60fps వద్ద 4K UHD వీడియోను రికార్డ్ చేయొచ్చు. మీరు కేవలం సాధారణ డే టైమ్ క్లిప్‌లకే పరిమితం కాదు.. బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్‌లో భారీ 6600mAh యూనిట్ కూడా ఉంది. ఇందులో 100W వైర్డ్ ఫ్లాష్‌ఛార్జ్, అలాగే 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ అందిస్తుంది. గేమింగ్, ఫొటోగ్రఫీ స్ట్రీమింగ్ కోసం ఎక్కువ టైమ్ వాడే యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందింది.

ప్రీమియం డిజైన్, సాఫ్ట్‌వేర్ :
డిజైన్ పరంగా వివో X300 అల్ట్రా ఫోన్ ఫ్రంట్ సైడ్ ఆర్మర్ గ్లాస్, అల్యూమినియం ఫ్రేమ్ బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిషింగ్‌తో ఫ్లాగ్‌షిప్ లుక్‌ అందిస్తుంది. ప్రొటెక్షన్ కోసం వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68,IP69 రేటింగ్‌ అందిస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6పై రన్ అవుతుంది. ఫొటోగ్రఫీ, గేమింగ్ రోజువారీ కోసం అనేక ఏఐ-ఆధారిత ఫీచర్లను కూడా చేర్చాలని వివో భావిస్తోంది.