Vivo X300e Launch : వివోనా మజాకా.. భారీ ఫీచర్లతో వివో X300e వస్తోందోచ్.. శాంసంగ్, షావోమీ, వన్‌ప్లస్‌కు దబిడిదిబిడే..!
Vivo X300e Launch : వివో X300 అల్ట్రా, వివో X300 ఎఫ్ఈ ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. రాబోయే వివో X300 ఎఫ్ఈ కూడా అదే తరహా స్పెసిఫికేషన్‌లతో రానుంది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published on- July 6, 2026 / 09:06 PM IST
Vivo X300e Launch
- వివో X300e ఫోన్ 6.59-అంగుళాల ఓఎల్ఈడీ ఫ్లాట్ డిస్‌ప్లే
- స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్, 50ఎంపీ ప్రైమరీ కెమెరా
- ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,015mAh లేదా 7,100mAh బ్యాటరీ
Vivo X300e Launch : వివో ఫ్యాన్స్ పండగ చేస్కోండి.. వివో X300e ఫోన్ అతి త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కాబోతుంది. అంతకన్నా ముందుగానే ఈ ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి. వివో X300 అల్ట్రా, వివో X300 ఎఫ్ఈ ఇటీవలే దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. రాబోయే వివో ఫోన్ స్పెసిఫికేషన్లు వివో X300 ఎఫ్ఈ మాదిరిగానే ఉండవచ్చు. షావోమీ, శాంసంగ్, వన్‌ప్లస్ ఫోన్లకు పోటీగా రాబోతుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో మొత్తం 5 మోడళ్లు ఉన్నాయి. అందులో వివో ఎక్స్300e ఫోన్ 1.5కే రిజల్యూషన్‌తో 6.59-అంగుళాల ఓఎల్ఈడీ ఫ్లాట్ డిస్‌ప్లేతో వస్తుందని అంచనా. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో జైస్-బ్రాండెడ్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుందని అంచనా.
వివో ఎక్స్300ఇ ఫోన్ రియర్ కెమెరా యూనిట్‌లో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 50ఎంపీ సోనీ IMX8 సిరీస్ పెరిస్కోప్ కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉండొచ్చు. ఇందులో 50ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉండొచ్చు. సేఫ్టీ కోసం ఇందులో అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉండొచ్చు.
వివో ఎక్స్300ఇ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో 7,015mAh లేదా 7,100mAh బ్యాటరీ ఉండవచ్చు. మెటల్ ఫ్రేమ్‌తో రావొచ్చు. గత మేలో భారత మార్కెట్లో వివో ఎక్స్300 ఎఫ్ఈ లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.31-అంగుళాల డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.
వివో ఎక్స్300 ఎఫ్ఈ ఫోన్ 6,500mAh బ్యాటరీ, 90డబ్ల్యూ వైర్డ్, 40డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4,005 చదరపు మిల్లీమీటర్ల వరకు హీట్ స్ప్రెడ్ అవుతుంది. ఇందుకోసం వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది.
వివో ఎక్స్300 ఎఫ్ఈ ఫోన్ జైస్-ట్యూన్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, ఆటోఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50ఎంపీ సోనీ IMX921 ప్రైమరీ కెమెరా ఉంది. 50ఎంపీ టెలిఫోటో కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి.
ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4K/60 ఎఫ్‌పీఎస్ వరకు వీడియోలను రికార్డ్ చేయగలదు. సేఫ్టీ కోసం ఇందులో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. గత కొన్నేళ్లుగా వివో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ సేల్స్ భారీగా పెరిగాయి.
