Vivo X300s Launch : వివోనా మజాకా.. ఈసారి 2 కొత్త ఫోన్లు భయ్యా.. ఫీచర్లు మాత్రం కిర్రాక్.. ధర కూడా చాలా తక్కువే!
Vivo X300s Launch : వివో నుంచి సరికొత్త సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్ కు ముందుగానే కీలక ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
- Sreehari A
- Published On : March 21, 2026 / 07:14 PM IST
Vivo X300s Launch
- వివో X300S మార్చి 30న చైనాలో లాంచ్ కానుంది.. ఏప్రిల్ 3 నుంచి సేల్ ప్రారంభం
- 144Hz AMOLED డిస్‌ప్లే, డైమెన్సిటీ 9500 చిప్‌సెట్, భారీ 7,100mAh బ్యాటరీ అంచనా
- భారత్ లాంచ్ తేదీపై నో క్లారిటీ.. ధర సుమారు రూ. 55,000 ఉండొచ్చు
Vivo X300s Launch : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో వివో నుంచి రెండు కొత్త ఫోన్లు రాబోతున్నాయి. నివేదికల ప్రకారం వివో చైనా లాంచ్ తర్వాత గ్లోబల్ మార్కెట్‌లో ఈ రెండు ఫోన్లను లాంచ్ చేసే అవకాశం ఉంది.
వివో X300s, వివో X300 అల్ట్రాతో సహా కొత్త డివైజ్‌లను రిలీజ్ చేయనుంది. ఈ డివైజ్ హై-ఎండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్, ఆకట్టుకునే కెమెరా సెటప్ తో రానుందని అంచనా. వివో X300s లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్లు, ధరతో సహా పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
వివో X300S లాంచ్ టైమ్ :
వివో X300s, వివో X300 అల్ట్రాతో పాటు మార్చి 30న చైనాలో లాంచ్ కానున్నాయి. ఈ కొత్త వివో ఫోన్ సేల్స్ ఏప్రిల్ 3న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ వివో ఫోన్లకు సంబంధించి గ్లోబల్ లేదా భారత మార్కెట్లో లాంచ్ ప్లాన్లపై కంపెనీ ధృవీకరించలేదు. నివేదికల ప్రకారం.. వివో X300 అల్ట్రా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. కానీ, వివో X300s మాత్రం ఎంపిక చేసిన మార్కెట్లలో అందుబాటులో ఉండొచ్చు.
Read Also : iPhone 17 Pro : ఇది కదా డిస్కౌంట్.. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో భారీగా తగ్గిందోచ్.. ఇంత కన్నా తక్కువకు మళ్లీ దొరకదు!
వివో X300s స్పెసిఫికేషన్లు :
వివో X300s ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుందని అంచనా. ఈ సెగ్మెంట్‌లో ఇదే ఫస్ట్ కావచ్చు. అదే మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్, 16GB వరకు ర్యామ్‌తో వస్తుందని అంచనా. ఈ వివో ఫోన్ 7,100mAh బ్యాటరీతో పాటు 90W ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో వస్తుందని అంచనా.
ఈ వివో ఫోన్ IP68, IP69 రేటింగ్‌లు, స్టీరియో స్పీకర్లు, మెరుగైన వైబ్రేషన్ ఫీడ్‌బ్యాక్, గేమింగ్ కోసం మెరుగైన కనెక్టివిటీ కూడా ఉండవచ్చు. ఈ వివో ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6పై రన్ అవుతుందని అంచనా. కెమెరా విషయానికి వస్తే.. ఈ పరికరానికి జైస్ (Zeiss) సపోర్టు ఉన్న 200MP మెయిన్ కెమెరా, 50MP పెరిస్కోప్ లెన్స్ లభించవచ్చు.
వివో X300S ధర :
ఈ వివో ఫోన్ అధికారిక ధర ఇంకా రివీల్ చేయలేదు. అంచనాల ప్రకారం.. వివో X300S భారత మార్కెట్లో లాంచ్ అయితే ధర సుమారు రూ. 55,000 మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. అయితే, రిలీజ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం, వివో ఎక్స్300, ఎక్స్300 ప్రో ఇప్పటికే భారత మార్కెట్లో లభ్యమవుతున్నాయి.
