Vivo X500 Pro Max : శాంసంగ్, షావోమీకి కొత్త టెన్షన్! వివో X500 సిరీస్ వచ్చేస్తోంది.. ఫ్లాగ్‌షిప్ మార్కెట్‌లో దుమ్మురేపనుందా?

Vivo X500 Pro Max : ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ రాబోయే డైమెన్సిటీ 9600 ప్రో ప్రాసెసర్‌తో రన్ అవుతుందని భావిస్తున్నారు. రాబోయే వివో X500 ప్రో స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో చిప్‌సెట్‌ను అమర్చనున్నట్లు అంచనా.

Vivo X500 Pro Max

  • మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో చిప్‌సెట్‌తో రానుంది
  • ఈ స్మార్ట్‌ఫోన్‌లో 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండొచ్చు
  • వివో X500 సిరీస్‌లో 3 మోడళ్లు ఉండొచ్చు

Vivo X500 Pro Max : వివో నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. అతి త్వరలో కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ లాంచ్ చేయనుంది. వివో X500 సిరీస్‌లో మొత్తం 3 మోడళ్లు ఉంటాయని అంచనా. వివో X500 ప్రో మ్యాక్స్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో ప్రాసెసర్‌ అమర్చనున్నట్లు అంచనా. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌కు సంబంధించి కంపెనీ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.

వివో X500 ప్రో మ్యాక్స్ ఫోన్ V2602DA మోడల్ నంబర్‌తో చైనా కంపల్సరీ సర్టిఫికేషన్ (3C) వెబ్‌సైట్‌లో లిస్ట్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5జీ కనెక్టివిటీ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నట్లు అంచనా. వివో X500 ప్రో మ్యాక్స్‌ ఫోన్ కొత్త ఇమేజింగ్ సిస్టమ్‌తో టెస్టింగ్ చేస్తున్నట్టు టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఇటీవలే రిపోర్టు చేసింది.

ఈ స్మార్ట్‌ఫోన్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP సోనీ LOFIC ప్రైమరీ కెమెరా ఉంటుందని అంచనా. వివో X500 ప్రో మ్యాక్స్‌లో 85mm ఫోకల్ లెంగ్త్‌తో 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటుందని అంచనా. ఈ కెమెరా హై క్వాలిటీ టెలిఫోటో మాక్రో ఫోటోగ్రఫీకి సపోర్ట్ చేస్తుంది. 50MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉండొచ్చు.

Read Also : Nothing Phone 4b Deal : సూపర్ డిస్కౌంట్.. నథింగ్ ఫోన్ 4b చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ రాబోయే డైమెన్సిటీ 9600 ప్రో ప్రాసెసర్‌ ఉండొచ్చు. రాబోయే స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో వివో X500 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో చిప్‌సెట్ ఉండవచ్చు. ఈ కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌లో 6.37-అంగుళాల డిస్‌ప్లే ఉండవచ్చు. వివో X500 ప్రో రియర్ కెమెరా యూనిట్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉండొచ్చు.

50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉండొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 64MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండొచ్చు. వివో X500 ప్రోలో 7,000mAh కన్నా బ్యాటరీ ఉండొచ్చు. గత ఏడాది డిసెంబర్‌లో భారత మార్కెట్లో వచ్చిన వివో X300 ప్రోకు అప్‌గ్రేడ్ వెర్షన్ అని చెప్పొచ్చు.

వివో X300 ప్రోలో 120Hz రిఫ్రెష్ రేట్‌, 6.78-అంగుళాల 1.5K ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. వివో X300 ప్రో ఫోన్ 6,510mAh బ్యాటరీ, 90W వైర్డ్ 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP సోనీ LYT-828 ప్రైమరీ కెమెరా, 200MP టెలిఫోటో కెమెరా, 50MP JN1 అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.