Vivo X500 Pro Max : ఫొటోగ్రఫీ లవర్స్‌కు పండగే.. 200MP జూమ్ కెమెరాతో వివో X500 ప్రో మ్యాక్స్ వస్తోందోచ్..!

Vivo X500 Pro Max : వివో నుంచి ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్ రాబోతుంది. 200MP జూమ్ కెమెరాతో వివో X500 ప్రో మ్యాక్స్ అదరగొట్టనుంది. పూర్తి ఫీచర్లపై భారీ అంచనాలివే..

Vivo X500 Pro Max

  • మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో చిప్‌సెట్‌ సెటప్
  • ఈ స్మార్ట్‌ఫోన్‌లో 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండొచ్చు
  • వివో X500 సిరీస్‌లో 3 మోడళ్లు ఉండనున్నాయి

Vivo X500 Pro Max : వివో లవర్స్ కోసం అద్భుతమైన ప్రో ఫోన్ వచ్చేస్తోంది. వివో నుంచి పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ రాబోతుంది. వివో X500 సిరీస్‌లో మొత్తం 3 మోడళ్లు ఉండొచ్చని అంచనా. ఇందులో టాప్-ఎండ్ వివో X500 ప్రో మ్యాక్స్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు.

ఈ ఫోన్ V2602DA మోడల్ నంబర్‌తో చైనా 3C సర్టిఫికేషన్‌లో కనిపించినట్లు తెలుస్తోంది. లిస్టింగ్ ప్రకారం.. 5జీ కనెక్టివిటీతో పాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. అయితే, వివో ఇప్పటివరకు ఈ ఫోన్‌కు సంబంధించిన అధికారిక వివరాలను రివీల్ చేయలేదు.

Read Also : iQOO 16 Launch : వావ్.. కొత్త ఐక్యూ 16 ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ వచ్చేస్తోంది.. కెమెరా ఫీచర్లపై భారీ అంచనాలివే..!

కెమెరాల పరంగా పరిశీలిస్తే..
వివో X500 ప్రో మ్యాక్స్ భారీ అప్‌గ్రేడ్‌ అందించవచ్చని టిప్‌స్టర్లు చెబుతున్నారు. 50MP సోనీ LOFIC మెయిన్ కెమెరాతో పాటు 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండొచ్చని అంచనా .

85mm ఫోకల్ లెంగ్త్‌తో వచ్చే ఈ కెమెరా టెలిఫోటో మాక్రో ఫోటోగ్రఫీకి కూడా సపోర్టు చేయనుంది. 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉండొచ్చని తెలుస్తోంది.

పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే..
రాబోయే మీడియాటెక్ డైమన్షిటీ 9600 ప్రో చిప్‌సెట్‌తో వస్తుందని అంచనా. ఇదే సిరీస్‌లోని వివో X500 ప్రో కూడా ఈ చిప్‌తో రావచ్చని అంచనా.

ప్రో మోడల్‌లో 6.37-అంగుళాల డిస్‌ప్లే, 50MP మెయిన్, 50MP అల్ట్రా-వైడ్, 64MP పెరిస్కోప్ కెమెరాలు, 7,000mAhకు పైగా బ్యాటరీ ఉండొచ్చని అంచనా. ప్రస్తుతానికి ఈ లీకులు కేవలం అంచనాలు మాత్రమే.. అధికారిక స్పెసిఫికేషన్లు, ధర, లాంచ్ తేదీపై వివో నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.