Vivo Y31s 5G Launch : వావ్.. 6500mAh బ్యాటరీతో వివో Y31s 5G వచ్చేసింది.. ఫీచర్లు మాత్రం కిర్రాక్ భయ్యా..!
Vivo Y31s 5G Launch : ఈ వివో స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 50MP HD ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా కూడా ఉంది. పూర్తి వివరాలివే..
- Sreehari A
- Updated on- June 9, 2026 / 06:31 PM IST
Vivo Y31s 5G
- వివో Y31s 5జీ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్ ఆప్షన్
- 6,500mAh బ్లూవోల్ట్ బ్యాటరీ, ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా
- 6.74-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది
Vivo Y31s 5G Launch : వివో ఫ్యాన్స్ కోసం సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. వివో Y31s 5జీ ఫోన్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ అందించారు. 6.74-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే ఉంది. వివో 5జీ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లోని 6,500mAh బ్లూవోల్ట్ బ్యాటరీ, 44W ఫ్లాష్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు (Vivo Y31s 5G Launch) సపోర్ట్ చేస్తుంది. వివో Y31s 5జీ ఫోన్ 6.74-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6పై రన్ అవుతుంది.
వివో Y31s 5జీ ధర ఎంతంటే? :
మలేషియాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో సింగిల్ వేరియంట్ కోసం RM1,499 (సుమారుగా రూ. 35,200) ధరతో లభిస్తుంది. వివో Y31s 5జీ ఫోన్ పర్పుల్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మలేషియాలో కంపెనీ వెబ్‌సైట్ పార్టనర్ రిటైలర్ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంది.
Read Also : Ultraviolette F77 : పెట్రోల్ బిల్లుకు గుడ్‌బై! అల్ట్రావయోలెట్ EV బైకులపై రూ. 30వేలు క్యాష్‌బ్యాక్ ఆఫర్..!
వివో Y31s 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ డ్యూయల్-సిమ్ స్మార్ట్‌ఫోన్ 1,050 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. 6.74-అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే ఉంది. సన్‌లైట్‌లో కూడా డిస్‌ప్లే క్లియర్ ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6పై రన్ అవుతుంది. డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP హెచ్‌డీ ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా ఉంది.
కనెక్టివిటీ విషయానికి వస్తే..
ఇందులో 5G, NFC, USB టైప్-C పోర్ట్ ఆప్షన్లు ఉన్నాయి. కాల్ రికార్డింగ్, ఆడియో రికార్డింగ్ ఫంక్షన్లకు సపోర్ట్ చేస్తుంది. వివో Y31s 5జీలోని 6,500 mAh బ్లూవోల్ట్ బ్యాటరీ 44W ఫ్లాష్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఈ వివో ఫోన్ బరువు సుమారుగా 209 గ్రాములు ఉంటుంది. వివో Y500 కూడా త్వరలో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కావచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ గత ఏడాది సెప్టెంబర్‌లో చైనాలో లాంచ్ కాగా వివో Y500 ఫోన్ 8,200mAh బ్యాటరీతో త్వరలో భారత్ సహా గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
