Vivo Y32 Dual Cameras : డ్యుయల్ రియర్ కెమెరాలతో వివో Y32 స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు చూస్తే ఫిదానే!

వివో నుంచి (Vivo) Y సిరీస్ నుంచి కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయింది. ఈ సరికొత్త వివో Y సిరీస్ స్మార్ట్ ఫోన్.. రెండు డ్యుయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి.

Vivo Y32 With Dual Rear Cameras, Snapdragon 680 Soc Launched Price, Specifications

Vivo Y32 Dual Cameras : ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ వివో నుంచి (Vivo) Y సిరీస్ నుంచి కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయింది. ఈ సరికొత్త వివో Y సిరీస్ స్మార్ట్ ఫోన్.. రెండు డ్యుయల్ రియర్ కెమెరాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. వాటర్ డ్రాప్ స్టయిల్ డిస్‌ప్లే (waterdrop-style display)తో పాటు స్పెషల్ ఫీచర్లు యూజర్లను ఆకట్టుకునేలా ఉండనున్నాయి. అక్టోబర్‌ నెలలో Vivo Y32 స్మార్ట్ ఫోన్.. Snapdragon 778G Plus, Snapdragon 695, and the Snapdragon 480 Plus 5G చిప్‌సెట్‌లతో పాటు Qualcomm స్నాప్‌డ్రాగన్ 680 SoC కూడా లాంచ్ అయింది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే.. 27 రోజుల స్టాండ్‌బై టైం లేదా 18 గంటల కంటే ఎక్కువ టాక్‌టైమ్‌ను అందించనుంది.

Vivo Y32 ధర ఎంతంటే? :
Vivo చైనా వెబ్‌సైట్‌లో లిస్టు ప్రకారం.. Vivo Y32 సింగిల్ (8GB RAM + 128GB) స్టోరేజ్ వేరియంట్.. దీని ధర CNY 1,399 (దాదాపు రూ. 16,700)గా నిర్ణయించింది కంపెనీ. ఈ ఫోన్ Foggy Night and Harumi Blue కలర్ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ సేల్ డేట్.. చైనా కాకుండా ఇతర మార్కెట్లలో అందుబాటులో ఉంటుందా లేదా అనే వివరాలు వెల్లడించలేదు. గత నెలలో, Vivo Y32 డిజైన్, స్పెసిఫికేషన్‌ల వివరాలను చైనా TENAAలో రివీల్ చేసింది. ఏయే ఫీచర్లు ఉన్నాయో ఓసారి చూద్దాం…

Vivo Y32 స్పెసిఫికేషన్లు :
Dual SIM (Nano) Vivo Y32 Android 11‌పై OriginOS 1.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.51-అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్‌) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 680 SoC ఆధారంగా పనిచేస్తుంది. 8GB LPDDR4x RAMతో పాటు ఇంటర్నల్ స్టోరేజీతో 12GB వరకు ఎక్స్ ఫాండ్ చేసుకోవచ్చు. Vivo Y32 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. f/2.2 లెన్స్‌తో 13-MP ప్రైమరీ సెన్సార్ f/2.4 లెన్స్‌తో 2-MP సెకండరీ సెన్సార్లతో వస్తోంది.

ఇక సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం.. Vivo Y32 ఫ్రంట్ సైడ్ f/1.8 లెన్స్‌తో 8-MP సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను అందిస్తోంది. Vivo Y32 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తోంది. కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే.. 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ v5.0, GPS/ A-GPS, USB Type-C 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మాగ్నెటోమీటర్ సామీప్య సెన్సార్ కూడా ఉన్నాయి. ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. Vivo 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీతో వస్తోంది. Vivo Y32 స్మార్ట్ ఫోన్ 164.26×76.08x8mm కొలతలు, 182 గ్రాముల బరువు ఉంటుంది.

Read Also : Reserved Berths For Women : రైళ్లలో సుదూర ప్రయాణాలు చేసే మహిళలకు ప్రత్యేక బెర్త్‌లు!