Vivo Y6 5G Launch : వివో కొత్త 5G ఫోన్ కేక.. 7200mAh భారీ బ్యాటరీ, 44W ఛార్జింగ్ సపోర్టుతో దుమ్మురేపుతోంది.. ధర చాలా తక్కువ!

Vivo Y6 5G Launch : వివో నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. 44W ఛార్జింగ్ సపోర్టు, 7200mAH బ్యాటరీతో అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. ఈ కొత్త వివో ఫోన్ ధర, ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Vivo Y6 5G Launch

  • వివో Y6 5జీ 256GB వరకు UFS3.1 స్టోరేజ్‌ అందిస్తుంది
  • ఈ ఫోన్‌కు IP69 + IP68 రేటింగ్ కూడా ఉంది
  • వివో Y6 5G సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌

Vivo Y6 5G Launch : కొత్త వివో ఫోన్ కొంటున్నారా? చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో నుంచి లేటెస్ట్ Y-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌గా వివో Y6 5G చైనాలో లాంచ్ అయింది. ఈ కొత్త వివో ఫోన్ 3 విభిన్న కలర్ ఆప్షన్లలో లభిస్తుంది 44W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు, 7,200mAh బ్యాటరీతో వస్తుంది.

అలాగే స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ కూడా ఉంది. 256GB వరకు ఆన్‌బోర్డ్ (Vivo Y6 5G Launch) స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఇతర ఫీచర్లలో 12GB వరకు ర్యామ్ 50MP రియర్ కెమెరా యూనిట్ ఉన్నాయి. దుమ్ము, నీటి రెసిస్టెన్స్ కోసం IP68, IP69 సర్టిఫికేషన్‌ కూడా ఉంది.

వివో Y6 5G ధర, లభ్యత :
వివో Y6 5జీ ఫోన్ 8జీబీ + 128జీబీ ర్యామ్ స్టోరేజ్ వేరియంట్ ధర సీఎన్‌వై 1,799 (సుమారుగా రూ. 24,000)కు పొందవచ్చు. 8జీబీ + 256జీబీ, 12జీబీ + 256జీబీ ర్యామ్ స్టోరేజ్ మోడళ్ల ధరలు వరుసగా CNY 1,999 (సుమారుగా రూ. 27,000 ) , CNY 2,199 (సుమారుగా రూ. 30,000)గా ఉన్నాయి. చైనాలో గెలాక్సీ సిల్వర్, అబ్సిడియన్ బ్లాక్ ఫీనిక్స్ వెల్కమ్స్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

వివో Y6 5జీ స్పెసిఫికేషన్లు :
డ్యూయల్-సిమ్ (నానో+నానో) వివో Y6 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6పై రన్ అవుతుంది. ఇందులో 6.75-అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ (720×1,570 పిక్సెల్స్) డిస్‌ప్లే ఉంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి.

Read Also : Redmi A7 Series Sale : రెడ్‌మి ఫ్యాన్స్ ఎగిరిగంతేసే ఆఫర్.. రెడ్‌మి A7 సిరీస్ ఫస్ట్ సేల్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంతంటే?

ఈ డిస్‌ప్లే 90.60 శాతం బాడీ-టు-స్క్రీన్ రేషియో 1500:1 కాంట్రాస్ట్ రేషియో ఉంది. ఈ ఫోన్ 4nm ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. అడ్రినో 613, 12GB వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ అందిస్తుంది.

కెమెరాల విషయానికొస్తే..
వివో Y6 5జీలో ఎఫ్/2.2 అపర్చర్‌తో 50MP CMOS సెన్సార్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్రంట్ సైడ్ ఎఫ్/2.05 అపర్చర్‌తో 8MP కెమెరా కూడా ఉంది. ఈ కెమెరా యూనిట్లు పోర్ట్రెయిట్ మోడ్, లైవ్ ఫోటో, నైట్ సీన్, స్లో మోషన్ వంటి పలు కెమెరా మోడ్‌లకు సపోర్ట్ చేస్తాయి.

వివో Y6 5జీ ఫోన్ 256GB వరకు UFS3.1 స్టోరేజ్‌ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi 5G, బ్లూటూత్ 4.2, GPS, BeiDou, GLONASS, Galileo, QZSS, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇందులో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి సెన్సార్లు ఉన్నాయి.

అథెంటికేషన్ కోసం వివో Y6 5జీలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌ సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్‌కు డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69 + IP68 రేటింగ్ ఉంది. SGS గోల్డ్ లేబుల్ 5-స్టార్ డ్రాప్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ 6 కూడా ఉన్నట్లు పేర్కొంది.

వివో Y6 5జీలో 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,200mAh బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై 15.5 గంటల వరకు నావిగేషన్ టైమ్ 39.1 గంటల వరకు కాలింగ్ టైమ్ అందిస్తుందని అంచనా. ఈ ఫోన్ కొలతలు 166.64 x 78.43 x 8.39mm, బరువు 219 గ్రాములు ఉంటుంది.