Vivo Y600K Turbo : వివోనా మజాకా.. కొత్త వివో Y600K టర్బో వస్తోందోచ్.. ధర, ఫీచర్లపై భారీ అంచనాలు..!

Vivo Y600K Turbo : ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ QTI SM7635 చిప్, 2.80GHz క్లాక్ స్పీడ్ ప్రైమ్ సీపీయూ ఉన్నాయి. వివో Y600K టర్బో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 లేదా స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్‌తో రన్ అవుతుందని అంచనా.

  • Published on- September 21, 2026 / 07:17 PM IST

Vivo Y600K Turbo

  • స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌, 120Hz రిఫ్రెష్ రేట్‌
  • ఆండ్రాయిడ్ 16, 6.83-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే
  • వివో Y600 టర్బో రీబ్రాండెడ్ వెర్షన్ కావొచ్చు

Vivo Y600K Turbo : వివో లవర్స్ గెట్ రెడీ.. అతి త్వరలో మీకోసం అద్భుతమైన ఫోన్ రాబోతుంది. వివో Y600K టర్బోను లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ ఉంటుందని అంచనా. ఈ ఏడాది మే నెలలో చైనాలో లాంచ్ అయిన వివో Y600 టర్బో రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు.

వివో Y600K టర్బో, V2553A అనే ​​మోడల్ నంబర్, PD2553 అనే డివైస్ కోడ్‌తో గూగుల్ ప్లే కన్సోల్ సపోర్ట్ చేసే డివైస్‌ల లిస్టులో చేరింది. ఈ మోడల్ నంబర్ డివైస్ కోడ్ వివో వై600 టర్భోకి కూడా సంబంధించినవే.

రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ వివో వై600 టర్బో రీబ్రాండెడ్ వెర్షన్ అని చెప్పొచ్చు. అయితే, వివో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇంకా ధృవీకరించలేదు. గూగుల్ ప్లే కన్సోల్‌లో ఈ లిస్టింగ్ ప్రకారం రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే రిజల్యూషన్ 1,260 x 2,800 పిక్సెల్స్, పిక్సెల్ డెన్సిటీ 480dpiగా ఉంటుందని తెలుస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ QTI SM7635 చిప్, 2.80 GHz క్లాక్ స్పీడ్ ప్రైమ్ సీపీయూతో రన్ అవుతుంది. వివో Y600K టర్బో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 లేదా స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్‌తో వర్క్ అవుతుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12GB ర్యామ్ ఉంటుందని అంచనా.

Read Also : Google Pixel 11 Pro XL : రూ.10 వేలు తగ్గుతుందంటే ఎవరైనా కొంటారు.. పిక్సెల్ 11 ప్రో ఎక్స్‌ఎల్‌పై భారీ ఆఫర్!

ఆండ్రాయిడ్ 16తో రావచ్చు. వివో Y600 ప్రో ఫోన్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.83-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్OS6పై రన్ అవుతుంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

వివో Y600 టర్బో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 9,020mAh ‘బ్లూ ఓషన్’ బ్యాటరీ ఉంది. 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వివో కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ త్వరలో అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ కానుంది.

ఈ ఏడాది జూన్‌లో చైనాలో వివో ఎక్స్ ఫోల్డ్ 6 లాంచ్ అయింది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో 7,000mAh బ్యాటరీ ఉంది. ఇందులో జైస్-బ్రాండెడ్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఇటీవల లాంచ్ అయిన ఆపిల్ ఐఫోన్ డ్యూయో, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రాతో పోటీ పడనుంది.