Vivo Y600s Pro Launch : 10,200mAh బ్యాటరీ, 50MP కెమెరాతో కొత్త వివో ఫోన్‌.. ఫీచర్లు చూస్తే ఫిదానే, ధర జస్ట్ ఎంతంటే?

Vivo Y600s Pro Launch : వివో నుంచి అద్భుతమైన ఫోన్.. 10,200mAh బ్యాటరీ, 50MP కెమెరా, డైమెన్సిటీ 7300e చిప్‌తో వస్తుంది. ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలివే..

Vivo Y600s Pro Launch

  • ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300e చిప్‌సెట్‌
  • రివర్స్ ఛార్జింగ్ సపోర్టు కూడా అందిస్తుంది
  • ఈ ఫోన్‌లో ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ ఫీచర్ ఉంది

Vivo Y600s Pro Launch : వివో నుంచి ఖతర్నాక్ ఫోన్.. వివో Y600s ప్రో కంపెనీ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300e చిప్‌తో రన్ అవుతుంది.

ఇందులో 10,000mAh కన్నా లాంగ్ బ్యాటరీతో వస్తుంది. HDR సపోర్ట్‌తో కూడా వస్తుంది. ఇందులో ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ కూడా ఉంది. సౌండ్ కోసం స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఈ బ్రాండ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ధర, ఇతర ప్రత్యేక ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలివే..

వివో Y600s ప్రో ధర
8GB+256GB వేరియంట్ ధర 2,699 యువాన్లు (సుమారుగా రూ. 39వేలు). టాప్-ఆఫ్-ది-లైన్ 8GB+512GB వేరియంట్ ధర 2,999 యువాన్లు (సుమారుగా రూ. 43వేలు). కంపెనీ మూన్‌లైట్ బ్లాక్, ఫ్లోటింగ్ గోల్డ్, స్టార్రీ పర్పుల్, వాస్ట్ బ్లూ అనే 4 కలర్ ఆప్షన్లలో వస్తుంది. చైనా మార్కెట్లో ఈ వివో ఫోన్ లాంచ్ అయింది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
వివో వై600ఎస్ ప్రోలో 6.83-అంగుళాల భారీ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ 2,800×1,260 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. 1.07 బిలియన్ కలర్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో స్మూత్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. HDR, P3 వైడ్ కలర్ గామట్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.

Read Also : Apple iPhone 17 Pro Max : వావ్.. అత్యంత చౌకైన ధరకే ఐఫోన్ 17 ప్రో మాక్స్.. ఇలా కొంటే రూ. 16 వేలకు పైగా ఆదా..!

ఈ వివో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300e చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 8GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజ్ అందిస్తుంది. సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6తో వస్తుంది.

వివో వై600ఎస్ ప్రో కెమెరా సెటప్‌లో 50MP రియర్ కెమెరా ఉంది. దీనితో పాటు 32MP ఫ్రంట్-ఫేసింగ్ సెల్ఫీ కెమెరా కూడా వస్తుంది. ఇందులో 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ 10,200mAh బ్యాటరీ ఉంది. రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ NFC, Wi-Fi 6, బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ ఆప్షన్‌ అందిస్తుంది. ఇందులో ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ కూడా ఉంది. ఆడియో కోసం స్టీరియో స్పీకర్లు అందుబాటులో ఉన్నాయి.