Vi Chepest Plan : Vi చీపెస్ట్ ప్లాన్..! ఒక్క రీచార్జ్‌తో 365 రోజులు ఎంజాయ్! 30GB హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్!
Vi Chepest Plan : వోడాఫోన్ ఐడియా కస్టమర్ల కోసం 365 రోజుల వ్యాలిడిటీతో వార్షిక ప్లాన్ తీసుకొచ్చింది. 30జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. పూర్తి ప్లాన్ వివరాలివే..
- Sreehari A
- Updated on- May 31, 2026 / 05:17 PM IST
Vi Chepest Plan ( Image Credit : AI )
- ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తుంది
- 3600 SMS బెనిఫిట్స్ సౌకర్యం, మరెన్నో డేటా బెనిఫిట్స్
- 365 రోజుల వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాలింగ్, 30GB బండిల్డ్ డేటా
Vi Chepest Plan : వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్.. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికాం కంపెనీలకు పోటీగా వోడాఫోన్ ఐడియా అద్భుతమైన ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్‌లను సరసమైన ధరకే అందిస్తోంది. కొన్ని కంపెనీలు కొన్ని రీఛార్జ్ ప్లాన్‌లను నిలిపివేయగా, మరికొన్నింటి ప్లాన్ల ధరలను భారీగా పెంచాయి.
వినియోగదారులు నెలనెలా రీఛార్జ్‌లు చేయాల్సిన అవసరం లేకుండా తక్కువ ధరలో వార్షిక ప్లాన్లు తీసుకోవచ్చు. వోడాఫోన్ ఐడియా తమ కస్టమర్లకు ఏడాది వ్యాలిడిటీతో చవకైన ప్లాన్‌ను అందిస్తోంది. ఇందులో బండిల్డ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటాయి. ఈ ప్లాన్ ఇతర కంపెనీల వార్షిక ప్లాన్‌ల కన్నా చాలా చవకైనది. పూర్తి ప్లాన్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రూ. 2249 రీఛార్జ్ ప్లాన్ :
వోడాఫోన్ ఐడియా (Vi) యూజర్లకు 365 రోజుల వ్యాలిడిటీతో అత్యంత చౌకైన ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి రూ.2,249కు కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, 3,600 SMS బెనిఫిట్స్ అందిస్తుంది.
రోజువారీ డేటా విషయానికి వస్తే.. ఈ ప్లాన్ మొత్తం వ్యాలిడిటీ కాలానికి 30GB బండిల్డ్ డేటాను అందిస్తుంది. డేటా కోటా అయ్యాక కూడా ప్రతి MBకి 50 పైసల చొప్పున ఛార్జ్ అవుతుంది. అలాగే, కాలింగ్ కోటా, లోకల్ కాల్స్‌కు నిమిషానికి ఒక రూపాయి, STD కాల్స్‌కు నిమిషానికి రూ. 1.5గా ఉంటుంది. ఈ కంపెనీ 365 రోజుల వ్యాలిడిటీతో మరో ప్లాన్ కూడా అందిస్తుంది.
రూ. 1849 రీఛార్జ్ ప్లాన్ :
వోడాఫోన్ ఐడియా యూజర్ల కోసం ఏడాది వ్యాలిడిటీతో మరో సరికొత్త ప్లాన్‌ను అందిస్తోంది. రూ. 1,849 చెల్లించి ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. వినియోగదారులకు 365 రోజుల పాటు అన్ లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది.
అయితే, కంపెనీ ఎలాంటి అదనపు బెనిఫిట్స్ అందించడం లేదు. ఈ ప్లాన్ యూజర్లకు ఒక ఏడాది పాటు అన్ లిమిటెట్ కాలింగ్‌ను మాత్రమే అందిస్తుంది. ఇందులో SMS బెనిఫిట్స్ లేదా డేటా బెనిఫిట్స్ రావు. ఏడాది మొత్తం రీఛార్జ్ చేయలేని వారికి ఈ ప్లాన్ అద్భుతంగా ఉంటుంది.
