Xiaomi Smart Mijia Ultra AC : ఉక్కపోతకు బైబై.. షావోమీ కొత్త ఏసీ వచ్చేసింది.. జస్ట్ 15 సెకన్లలో ఇల్లంతా కూల్.. ధర తెలిస్తే షాక్!
Xiaomi Smart Mijia Ultra : ఈ షావోమీ మిజియా పవర్ఫుల్ విండ్ అల్ట్రా 3HP ఏసీ అద్భుతమైన ఫీచర్లతో కేవలం 15 సెకన్ల వ్యవధిలోనే మీ ఇల్లంతా కూలింగ్ చేస్తుంది. ధర ఎంతంటే?
Xiaomi Smart Mijia Ultra ( Image Credit : AI )
- షావోమీ మిజియా పవర్ఫుల్ విండ్ అల్ట్రా 3HP ఏసీ వచ్చేసింది
- కేవలం 15 సెకన్లలో ఇల్లు మొత్తం కూలింగ్ చేయగలదు
- 11,000W కూలింగ్ సామర్థ్యం, 25.1cc డ్యూయల్ సిలిండర్ ఇంజన్
- హై అవుట్‌పుట్ ఏసీ, 11,000W కూలింగ్ కెపాసిటీ, 16,000W హీటింగ్ కెపాసిటీ
Xiaomi Smart Mijia Ultra : బాబోయ్.. అసలే సమ్మర్.. ఎండలు దంచేస్తున్నాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. ఇంట్లో లేదా ఆఫీసులో కాసేపు ఏసీ లేకుంటే ఉండటం కష్టమే. ఈ వేసవిలో ఎండ, ఉక్కపోతల నుంచి రిలీఫ్ పొందాలంటే ప్రతిఒక్కరి ఇంట్లో ఈ కొత్త స్మార్ట్ ఏసీ ఉండాల్సిందే. షావోమీ కొత్త స్టాండింగ్ ఎయిర్ కండిషనర్ మిజియా పవర్ఫుల్ విండ్ అల్ట్రా 3HP ఏసీ మార్కెట్లోకి వచ్చేసింది.
15 సెకన్లలో ఇల్లంతా కూల్ :
హైకెపాసిటీ క్లైమేట్ కంట్రోల్ యూనిట్ ఏసీ కేవలం 15 సెకన్లలో మీ ఇంటిని కూల్ చేయగలదని కంపెనీ తెలిపింది. భారీ గదులను కూడా క్షణాల్లో కూలింగ్ చేసేలా 3-హార్స్పవర్ సిస్టమ్ ప్రత్యేకంగా అమర్చారు. ఈ ఏసీలో 25.1cc డ్యూయల్ సిలిండర్ ఉంది.
డ్యూయల్-రో స్వచ్ఛమైన కాపర్ ఎవాపరేటర్, కండెన్సర్‌ను ఉపయోగించారు. హై అవుట్‌పుట్ ఏసీ, 11,000W కూలింగ్ కెపాసిటీ, 16,000W హీటింగ్ కెపాసిటీ అందించారు. ఈ ఏసీ ధర, ఇతర ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Read Also : Vivo S60 Launch : వావ్.. వివో S60 సిరీస్ రచ్చ రేపుతోంది.. బ్యాటరీ బ్యాకప్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
మిజియా ఏసీ ధర ఎంతంటే? :
మిజియా పవర్ఫుల్ విండ్ అల్ట్రా 3HP ఏసీ చైనా మార్కెట్లో లాంచ్ అయింది. ధర 5,999 యువాన్లు (సుమారు రూ. 84వేలు). షావోమీ స్టాండర్డ్ రిటైల్ స్టోర్లలో ఆన్లైన్ స్టోర్ (JD.com)లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
మిజియా ఏసీ స్పెసిఫికేషన్లు :
మిజియా పవర్ఫుల్ విండ్ అల్ట్రా 3HP ఏసీలో ఇంటర్నల్ 3 హార్స్పవర్ సిస్టమ్ అమర్చారు. 140Hz హై ఫ్రీక్వెన్సీ మోడ్‌లో 15 సెకన్లలో కూలింగ్, 30 సెకన్లలో హీట్ చేయగలదని కంపెనీ పేర్కొంది. 11,000W కూలింగ్ సామర్థ్యం, 16,000W హీటింగ్ సామర్థ్యం ఉన్నాయి. ఈ ఏసీలో 25.1cc డ్యూయల్ సిలిండర్ అమర్చారు. డ్యూయల్-రో స్వచ్ఛమైన కాపర్ ఎవాపరేటర్, కండెన్సర్ అందిస్తుంది.
ఈ ఏసీలో డ్యూయల్ సైన్వేవ్ మోటార్లు ఉన్నాయి. గంటకు 1800 క్యూబిక్ మీటర్ల ఎయిర్ ఫ్లో అందించగలదు. 115 డిగ్రీల వైడ్ యాంగిల్ స్వీప్ ఫంక్షన్ ఉంది. 16 మీటర్ల దూరం వరకు ఎయిర్ అందిస్తుంది. ఏపీఎఫ్ రేటింగ్ 4.90 అందిస్తుంది. పవర్ సేవింగ్ డివైజ్ ఏడాదికి 660kWh వరకు పవర్ ఆదా చేయగలదు.
తీవ్రమైన వాతావరణ పరిస్థితులలో అద్భుతంగా పనిచేస్తుంది. కంపెనీ ప్రకారం.. -35°C నుంచి 65°C మధ్య పనిచేసేలా రూపొందించారు. ఈ ఏసీని కంపెనీ స్మార్ట్ హోమ్ సిస్టమ్ HyperOS కనెక్ట్‌తో పెయిర్ చేయవచ్చు. ఈ ఏసీ కింద వివిధ కంట్రోలింగ్ ఫంక్షన్లు లభిస్తాయి. ఇది కాకుండా ఐటీఓ టచ్ డిస్ప్లే కూడా ఉంది.
