Google Pixel 10 Offer : పిక్సెల్ ఫ్యాన్స్ మీకోసమే.. ఈ పిక్సెల్ 10పై ఏకంగా రూ. 17వేలు డిస్కౌంట్.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు..!
Google Pixel 10 Offer : గూగుల్ పిక్సెల్ ఫోన్ కస్టమర్లకు భారీ ఆఫర్.. పిక్సెల్ 10 డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు. ఇలా కొన్నారంటే రూ. 17వేలకు పైగా కొనేసుకోవచ్చు.. ఈ డీల్ వివరాలివే..
- Sreehari A
- Published on- August 25, 2026 / 03:29 PM IST
Google Pixel 10 Offer
- భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ప్రారంభ ధర రూ. 79,999
- అమెజాన్‌లో పిక్సెల్ 10పై రూ. 14,119 ధర తగ్గింపు
- ఈ పిక్సెల్ 10 ఫోన్ ధర రూ. 65,880 మాత్రమే
- బ్యాంకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత ఆదా
Google Pixel 10 Offer : గూగుల్ పిక్సెల్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. గూగుల్ ఇటీవలే లేటెస్ట్ జనరేషన్ పిక్సెల్ 11 సిరీస్ లాంచ్ చేసింది. ఈ లైనప్‌లో పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో XL పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ అనే 4 మోడళ్లు ఉన్నాయి. అయితే, ఈ కొత్త 11 సిరీస్ కన్నా పాత జనరేషన్ పిక్సెల్ 10 కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే..
తక్కువ ధరకే కొత్త పిక్సెల్ ఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్. అమెజాన్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 17వేలకు పైగా డిస్కౌంట్ అందిస్తోంది. ఇలాంటి ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండవు. కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. పిక్సెల్ 10 ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
గూగుల్ పిక్సెల్ 10 డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ రూ. 79,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ పిక్సెల్ 10పై రూ. 14,119 డైరెక్ట్ డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా ఈ పిక్సెల్ ఫోన్ ధర రూ. 65,880కి తగ్గింది. అంతేకాదు.. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో అదనంగా రూ. 3,294 ఆదా చేయొచ్చు. ఇంకా డబ్బులు ఆదా చేసుకోవాలంటే మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఈజీగా ట్రేడ్-ఇన్ చేయవచ్చు.
పిక్సెల్ 10 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 6.3-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఫోన్‌కు టెన్సర్ G5 చిప్‌సెట్ పవర్ అందిస్తుంది. 12GB వరకు ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. అంతేకాదు.. ఈ ఫోన్ 4,970mAh బ్యాటరీతో వస్తుంది. 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్,15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే..
పిక్సెల్ 10 బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 48MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్, 10.8MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ పిక్సెల్ ఫోన్ ఫ్రంట్ సైడ్ 10.5MP కెమెరాతో వస్తుంది.
పిక్సెల్ 10 కొనాలా? వద్దా? :
గూగుల్ పిక్సెల్ 10 అనేది అడ్వాన్స్ స్మార్ట్‌ఫోన్.. క్లియర్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. అనేక ఏఐ ఆధారిత ఫీచర్లను కూడా అందిస్తుంది. ఇందులో కెమెరాలు మాత్రం హైలెట్.. అందుకే కెమెరా పర్ఫార్మెన్స్ కోరుకునే యూజర్లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
