iPhone 17 Pro Max : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.1.49 లక్షల ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ కావొద్దు!
iPhone 17 Pro Max : క్రోమాలో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై రూ.14,910 వరకు డిస్కౌంట్ అందస్తోంది. ఈ ఐఫోన్ ధర, బ్యాంక్ ఆఫర్లు, 48MP కెమెరాలు, A19 ప్రో చిప్సెట్ వంటి ముఖ్యమైన ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published on- October 14, 2026 / 07:43 PM IST
iPhone 17 Pro Max
- క్రోమాలో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై రూ.14,910 వరకు డిస్కౌంట్
- ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ. 1,49,900
- ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై రూ. 10,910 ఫ్లాట్ డిస్కౌంట్
- బ్యాంకు ఆఫర్లతో రూ. 4,000 అదనపు డిస్కౌంట్
iPhone 17 Pro Max : ఆపిల్ ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ప్రీమియం ఫోన్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కోసం చూస్తున్నారా? అయితే, మీకో మంచి డీల్.. ప్రముఖ రిటైల్ సంస్థ క్రోమా ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ క్రెడిట్ కార్డులపై అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో మొత్తం రూ.14,910 వరకు ఆదా చేయొచ్చు.
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్? :
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ భారత మార్కెట్లో రూ.1,49,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ప్రస్తుతం క్రోమా వెబ్సైట్లో ఈ ఐఫోన్‌పై (iPhone 17 Pro Max) రూ.10,910 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఈ ఐఫోన్ మోడల్ ధర రూ.1,38,990కు తగ్గుతుంది.
అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్ లేదా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే.. మరో రూ.4వేలు తగ్గింపు పొందవచ్చు. అన్ని ఆఫర్లు వర్తిస్తే.. ఈ ఐఫోన్ ధర రూ.1,34,990కు చేరుతుంది. అంటే.. మొత్తం రూ.14,910 వరకు ఆదా చేయొచ్చు. అయితే, బ్యాంక్ ఆఫర్‌కు సంబంధించిన నిబంధనలు, అర్హతలను కొనుగోలు చేసే ముందు చెక్ చేయాలి.
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఫీచర్లు :
ఈ ఫోన్లో 6.9 అంగుళాల 120Hz ప్రోమోషన్ డిస్ప్లే ఉంది. యాంటీ రిఫ్లెక్టివ్ స్క్రీన్, స్క్రీన్‌పై లైట్ రిఫ్లెక్షన్ తగ్గుతాయి. A19 ప్రో చిప్సెట్తో ఈ ఫోన్లో 39 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుందని ఆపిల్ పేర్కొంది.
కెమెరాల విషయానికి వస్తే..
బ్యాక్ సైడ్ మూడు 48MP కెమెరాలు ఉన్నాయి. ఇందులో మెయిన్ కెమెరా, అల్ట్రావైడ్ కెమెరా, 4x ఆప్టికల్ జూమ్‌తో టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 18MP కెమెరా ఇచ్చారు.
మెరుగైన హీట్ కంట్రోల్ కోసం వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్, అదనపు ప్రొటెక్షన్ కోసం సెరామిక్ షీల్డ్ 2 కూడా ఉన్నాయి. ప్రీమియం ఐఫోన్ కొనాలనుకునేవారికి ఈ డీల్ అద్భుతంగా ఉంటుంది. అయితే, ఆఫర్లు, ధరలు మారే అవకాశం ఉంది. క్రోమా వెబ్సైట్లో లేటెస్ట్ ఆఫర్ల వివరాలను చెక్ చేసి కొనుగోలు చేయండి.
