Best SmartTVs Sale 2026 : రూ.30 వేలలోపే 4K స్మార్ట్ టీవీ.. అమెజాన్ సేల్లో టీవీలపై భారీ డిస్కౌంట్లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో..!
Amazon Great Indian Festival 2026 : ఈ సేల్లో షావోమీ, శాంసంగ్, టీసీఎల్, ఫిలిఫ్స్, ఒనిడా స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. రూ.12,499 నుంచే స్మార్ట్ టీవీలు, రూ.30 వేలలోపు 4K QLED టీవీల ధరలు, బ్యాంక్ ఆఫర్ల వివరాలివే..
Best Smart TVs Under 30000
- అమెజాన్ సేల్లో టీవీలపై భారీ డిస్కౌంట్లు.. రూ.12,499 నుంచే స్మార్ట్ టీవీలు
- టీవీ కొనాలనుకుంటున్నారా? షావోమీ, శాంసంగ్ టీవీలపై అదిరిపోయే ఆఫర్లు
- ఇంటికి కొత్త టీవీ కొనాలా? షావోమీ టీవీపై ఏకంగా రూ.18వేలు తగ్గింపు..
Amazon Great Indian Festival 2026 : కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకోసం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్లో అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. షావోమీ, శాంసంగ్, టీసీఎల్, ఫిలిఫ్స్, ఒనిడా వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ టీవీలను రూ.30వేల లోపే సొంతం చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా 4K, QLED టీవీల కోసం చూస్తున్న వారికి ఈ డీల్స్ అద్భుతంగా ఉంటాయి.
షావోమీ టీవీపై రూ.18వేల వరకు తగ్గింపు :
ఈ సేల్లో షావోమీ 43-అంగుళాల ఎఫ్ఎక్స్ ప్రో 4K క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.44,999 కాగా, ప్రస్తుతం రూ.26,999కే అందుబాటులో ఉంది. అంటే రూ.18వేలు తగ్గింపు లభిస్తోంది. షావోమీ 32-అంగుళాల ఎఫ్ సిరీస్ HD స్మార్ట్ టీవీని రూ.24,999కు బదులుగా రూ.12,499కే కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్, టీసీఎల్ టీవీల ధరలివే :
శాంసంగ్ 43-అంగుళాల క్రిస్టల్ UHD 4K విజన్ ఏఐ 2026 టీవీ ధర రూ.29,490గా ఉంది. శాంసంగ్ 43-అంగుళాల FHD స్మార్ట్ టీవీ రూ.22,990కే లభిస్తోంది. ఇక శాంసంగ్ 32-అంగుళాల HD టీవీ ధర రూ.14,490గా ఉంది.
Read Also : Toyota Glanza Facelift 2026 : రూ.6.99 లక్షలకే కొత్త టయోటా గ్లాంజా.. లెవెల్-2 ADASతో అదిరిపోయే ఫీచర్లు!
టీసీఎల్ 40-అంగుళాల ఫుల్ హెచ్ డీ స్మార్ట్ క్యూఎల్ఈడీ గూగుల్ టీవీని రూ.22,490కే కొనుగోలు చేయవచ్చు. ఫిలిఫ్స్ 43-అంగుళాల 4K క్యూఎల్ఈడీ గూగుల్ టీవీ ధర రూ.27,999గా ఉంది.
55 అంగుళాల టీవీ కూడా రూ.30 వేలలోపే :
పెద్ద స్క్రీన్ టీవీ కావాలనుకునే వారికి VW 55-అంగుళాల ప్రో సిరీస్ 4K QLED టీవీ రూ.28,999కు అందుబాటులో ఉంది. VW 50-అంగుళాల 4K QLED టీవీ ధర రూ.25,999 కాగా, వనిడా 43-అంగుళాల 4కె స్మార్ట్ టీవీని రూ.22,499కే పొందవచ్చు.
బ్యాంక్ ఆఫర్లు కూడా :
ఎంపిక చేసిన ఎస్బీఐ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై నిబంధనలకు అనుగుణంగా 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్లు పొందవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో 5 శాతం క్యాష్బ్యాక్ వంటి బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే అదనపు ఆఫర్లు, అర్హత, ఫైనల్ ధరను చెల్లించే ముందు చెక్ చేసుకోవాలి.
| మోడల్ | లిస్టింగ్ ధర | సేల్ ధర |
|---|---|---|
| షావోమీ 43-అంగుళాల FX Pro 4K QLED స్మార్ట్ టీవీ | రూ. 44,999 | రూ. 26,999 |
| షావోమీ 32-అంగుళాల F సిరీస్ HD స్మార్ట్ LED టీవీ | రూ. 24,999 | రూ. 12,499 |
| శాంసంగ్ 43-అంగుళాల క్రిస్టల్ UHD 4K విజన్ AI 2026 స్మార్ట్ టీవీ | రూ. 39,900 | రూ. 29,490 |
| శాంసంగ్ 43-అంగుళాల FHD స్మార్ట్ LED టీవీ | రూ. 27,500 | రూ. 22,990 |
| శాంసంగ్ 32-అంగుళాల HD స్మార్ట్ LED టీవీ | రూ. 17,900 | రూ. 14,490 |
| ఫిలిప్స్ 43-అంగుళాల 8100 సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ QLED గూగుల్ టీవీ | రూ. 29,999 | రూ. 27,999 |
| VW విజియో వరల్డ్ 55-అంగుళాల ప్రో సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ QLED టీవీ | రూ. 64,999 | రూ. 28,999 |
| VW విజియో వరల్డ్ 50-అంగుళాల ప్రో సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ QLED టీవీ | రూ. 99,999 | రూ. 25,999 |
| TCL 40-అంగుళాల ఫుల్ HD స్మార్ట్ QLED గూగుల్ టీవీ | రూ. 32,390 | రూ. 22,490 |
| ఒనిడా 43-అంగుళాల అల్ట్రా HD 4K స్మార్ట్ LED టీవీ | రూ. 33,190 | రూ. 22,499 |
Note : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్లో అందించిన వివరాల ప్రకారం ధరలు అంచనాలు మాత్రమే. స్టాక్, ఆఫర్లు, బ్యాంక్ నిబంధనలను బట్టి ధరలు మారవచ్చు.
