Toyota Glanza Facelift 2026 : రూ.6.99 లక్షలకే కొత్త టయోటా గ్లాంజా.. లెవెల్-2 ADASతో అదిరిపోయే ఫీచర్లు!
Toyota Glanza Facelift 2026 : 2026 టయోటా గ్లాంజా ఫేస్లిఫ్ట్ భారత మార్కెట్లో విడుదలైంది. రూ.6.99 లక్షల ప్రారంభ ధర, లెవెల్-2 ADAS, 6 ఎయిర్బ్యాగ్స్, CNG AMT, 360-డిగ్రీ కెమెరా సహా కొత్త గ్లాంజా ధర, ఫీచర్లు, ఇంజిన్ వివరాలు తెలుసుకోండి.
Toyota Glanza Facelift 2026
- టయోటా గ్లాంజా ఫేస్లిఫ్ట్ వచ్చేసింది..
- 6 ఎయిర్బ్యాగ్స్, కొత్త ఫీచర్లతో సరికొత్త లుక్
- CNG కారులోనూ ఆటోమేటిక్ గేర్బాక్స్
Toyota Glanza Facelift 2026 : కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? తక్కువ ధరలో స్టైలిష్ లుక్, స్మార్ట్ ఫీచర్లు, మెరుగైన సేఫ్టీ కోరుకునే వారికి టయోటా గుడ్ న్యూస్ చెప్పింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ 2026 గ్లాంజా ఫేస్లిఫ్ట్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ప్రీమియం హ్యాచ్బ్యాక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.99 లక్షలు. కొత్త డిజైన్తో పాటు అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్లను కూడా ఇందులో అందించారు.
కొత్త లుక్తో గ్లాంజా :
2026 గ్లాంజా ఫ్రంట్ సైడ్ కొత్త క్రోమ్ ఫినిష్, ఆకర్షణీయమైన బంపర్, హనీకోంబ్ డిజైన్తో లోయర్ గ్రిల్ ఉన్నాయి. కొత్త సైడ్ స్కర్ట్స్ కారు లుక్ మరింత స్పోర్టీగా మార్చాయి. ఈ మోడల్ E, S, G, V, V(O) అనే 5 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
ఇంజిన్, CNGలో కొత్త ఆప్షన్ :
ఈ కారులో 1.2 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ను అందించారు. 82hp పవర్, 112.4Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్లో ఆటోమేటిక్ ఐడిల్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ కూడా ఉంది. మరో స్పెషాలిటీ ఏమిటంటే.. CNG వేరియంట్లోనూ AMT ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్ను అందించారు.
సేఫ్టీకి పెద్దపీట :
కొత్త గ్లాంజాలో మెయిన్ అట్రాక్షన్ V(O) వేరియంట్లో అందించే లెవెల్-2 అడాస్. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్-కీప్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అన్ని వేరియంట్లలో 6 ఎయిర్బ్యాగ్లను అందించారు. ABS, EBD, బ్రేక్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఉన్నాయి.
ఫీచర్లు కూడా అదుర్స్ :
360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్ప్లే (HUD), టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, టయోటా ఐ-కనెక్ట్ టెక్నాలజీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి.
ధర ఎంతంటే?
గ్లాంజా పొడవు 3,990 మి.మీ., వెడల్పు 1,745 మి.మీ., వీల్బేస్ 2,520 మి.మీ ఉంటుంది. ఈ కారు మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. రూ.6.99 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన కొత్త గ్లాంజా, స్టైలిష్ లుక్తో పాటు సేఫ్టీకి ప్రాధాన్యం ఇచ్చే కొనుగోలుదారులను ఆకట్టుకుంటుందా లేదో చూడాలి.
