WhatsApp Voice Note Transcription
WhatsApp Voice Note Transcription : ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. వాట్సాప్ వాయిస్ మెసేజ్ లు పంపేందుకు అద్భుతమైన ఫీచర్ ప్రవేశపెట్టింది. అదే.. వాయిస్ నోట్ ట్రాన్స్‌క్రిప్షన్. మీరు ఏదైనా బిజీగా మీటింగ్‌లో ఉన్నా లేదా ఇతర వర్క్‌లో ఉన్నా వాయిస్ మెసేజ్ వినలేరని వారికి ఈ అప్‌డేట్ బెస్ట్ అని చెప్పవచ్చు.
వాయిస్ నోట్ ట్రాన్స్‌క్రిప్షన్ వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్‌గా మారుస్తుంది. వినడానికి బదులుగా చదవడానికి యూజర్లను అనుమతిస్తుంది. ఆడియోను వినేందుకు సమయం లేనప్పటికీ వినియోగదారులు కనెక్ట్ అయి ఉండటానికి వాట్సాప్ మెసేజ్‌లను సులభంగా పంపుకునేలా ఈ ఫీచర్ రూపొందించింది.
ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే? :
ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ ముందుగా, Settings > Chats> Voice Message Transcription ఆప్షన్‌కు వెళ్లండి. మీరు ఫీచర్‌ను ఆన్ లేదా ఆఫ్ టోగుల్ చేయవచ్చు. ట్రాన్స్‌క్రిప్షన్ కోసం మీ ప్రైమరీ లాంగ్వేజీని కూడా ఎంచుకోవచ్చు. ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత వాయిస్ నోట్‌ని ట్రాన్స్‌క్రిప్షన్ కూడా అంతే సులభం.
మీరు వాయిస్ మెసేజ్ స్వీకరించినప్పుడు దానిపై ఎక్కువసేపు ట్యాప్ చేసి ‘transcription’ నొక్కండి. మీ సౌలభ్యం మేరకు చదవగలిగే మెసేజ్ టెక్స్ట్ వెర్షన్‌ను ఇన్‌స్టంట్‌గా యాప్ రూపొందిస్తుంది. అంతేకాదు, ఈ ట్రాన్స్‌స్ర్కిప్షన్ ప్రక్రియ పూర్తిగా మీ ఫోన్‌లోనే జరుగుతుంది. మీ వాయిస్ మెసేజ్‌లను పూర్తి ప్రైవసీతో ఉంటాయి. ఎక్స్‌ట్రనల్ సర్వర్‌లకు పంపబడవు. వాట్సాప్ కూడా మీ వాయిస్ నోట్స్‌లోని కంటెంట్‌ను యాక్సెస్ చేయదు. యూజర్ సెక్యూరిటీ, ప్రైవసీకి నిబద్ధతకు కట్టుబడి ఉంటుంది.
ప్రైవసీ, సెక్యూరిటీ :
ఈ ఫీచర్ వాట్సాప్ ప్రైవసీపై దృష్టిసారిస్తుంది. మీ ఫోన్‌లో ట్రాన్స్‌క్రిప్ట్‌లు లోకల్‌గా రూపొందించాయని నిర్ధారించుకోవాలి. థర్డ్ పార్టీ వాట్సాప్ కూడా మీ మెసేజ్‌లను చదవడం లేదా వినడం సాధ్యం కాదని కంపెనీ హామీ ఇస్తుంది. ఈ విధానం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, డేటా భద్రతకు విలువనిచ్చే వినియోగదారులకు భరోసా ఇస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి :
వాయిస్ ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ రాబోయే కొద్ది వారాల్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ప్రారంభంలో కొన్ని ఎంపిక చేసిన భాషలకు సపోర్టు అందిస్తుంది. అయితే, వాట్సాప్ కాలక్రమేణా మరిన్ని ప్రణాళికలను ధృవీకరించింది. ఈ ఫీచర్‌ను మరింత మంది యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.
Read Also : WhatsApp Message Drafts : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై మెసేజ్ డ్రాఫ్ట్‌లో కూడా పెట్టుకోవచ్చు!