Samsung Galaxy S25 Plus : ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్లు.. ఈ శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్‌పై ఏకంగా రూ. 25వేలు తగ్గింపు.. ఎలాగంటే?
Samsung Galaxy S25 Plus : శాంసంగ్ ఫోన్ ఆఫర్ అదిరింది.. ఈ శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ ధర అతి తక్కువ ధరకే లభిస్తోంది. అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
Samsung Galaxy S25 Plus
Samsung Galaxy S25 Plus : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ గెలాక్సీ డేస్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ ఫోన్ రూ. 25వేల తగ్గింపుతో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 5 వరకు గెలాక్సీ డేస్ సేల్‌ను నిర్వహిస్తోంది మీరు శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ ఫోన్‌ను రూ. 25వేల తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో మరిన్ని క్యాష్‌బ్యాక్ ఆఫర్లను పొందవచ్చు.
అంతేకాదు.. ఈ శాంసంగ్ ఫోన్ పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్తో వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 4900mAh బ్యాటరీ అందిస్తుంది. 4K వీడియో రికార్డింగ్ సామర్థ్యంతో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ ఫోన్ ఫీచర్లు, డిస్కౌంట్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తగ్గింపు ధర, మరిన్ని ఆఫర్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ 5G ఫోన్ ఫస్ట్ భారత మార్కెట్లో రూ.99,999 ధరకు లాంచ్ అయింది. కానీ, ఫ్లిప్‌కార్ట్ గెలాక్సీ డేస్ సేల్ సమయంలో రూ. 25వేల తగ్గింపుతో వస్తుంది. మీరు ఫోన్ కేవలం రూ. 74,999కి కొనుగోలు చేయవచ్చు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే.. మీరు రూ. 1,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మీకు ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే.. మీరు రూ. 3,748 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. నెలకు రూ. 2,636 నుంచి ఈజీ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు.
కెమెరా సెటప్, బ్యాటరీ ప్యాక్ :
శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ 5G ఫోన్ ఎఫ్/1.8 అపెర్చూర్, OISతో 50MP మెయిన్ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్, 30x డిజిటల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ అందిస్తుంది. 30fps వద్ద 8K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం డ్యూయల్ పిక్సెల్ PDAFతో 12MP కెమెరాతో వస్తుంది.
60fps వద్ద 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ అందిస్తుంది. ఈ ఫోన్ భారీ 4900mAh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 45W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 0 నుంచి 65శాతం వరకు ఛార్జ్ చేసేందుకు కేవలం 30 నిమిషాలు పడుతుంది. 15W వైర్లెస్ ఛార్జింగ్, 4.5W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్టు అందిస్తుంది.
డిస్ప్లే, డిజైన్ :
శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ 5G ఫోన్ క్వాడ్ HD+ రిజల్యూషన్‌తో భారీ 6.7 అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 2600 నిట్స్ హై టాప్ బ్రైట్నెస్ అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్‌తో వస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్ అందిస్తుంది.
పర్ఫార్మెన్స్ :
ఈ ఫోన్ గెలాక్సీ చిప్సెట్తో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ద్వారా పవర్ పొందుతుంది. మెరుగైన పర్ఫార్మెన్స్, గేమింగ్ కోసం ఆక్టా-కోర్ ప్రాసెసర్, రియల్-టైమ్ రే ట్రేసింగ్‌తో వస్తుంది. 12GB ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ టెక్నాలజీతో 256GB లేదా 512 GB స్టోరేజ్ ఆప్షన్లతో వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజీ పెంచుకోవడం కుదరదు. 5G కనెక్టివిటీ, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, అల్ట్రా వైడ్బ్యాండ్కు సపోర్టు ఇస్తుంది.
