WhatsApp User Privacy: యూజర్ల ప్రైవసీనే అత్యంత ప్రాధాన్యం : కేంద్రానికి వాట్సాప్‌ వివరణ

యూజర్ల ప్రైవసీకే అత్యంత ప్రాధాన్యమిస్తామని ప్రముఖ ఇన్ స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

WhatsApp User Privacy : యూజర్ల ప్రైవసీకే అత్యంత ప్రాధాన్యమిస్తామని ప్రముఖ ఇన్ స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల కంపెనీ తీసుకువచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ విధానంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యూజర్ల ప్రైవసీకి సంబంధించి వివరణ ఇవ్వాలంంటూ వాట్సాప్ కు కేంద్రం లేఖ కూడా రాసింది. ఇప్పుడు వాట్సాప్ స్పందించింది.

భారత ప్రభుత్వం లేఖపై స్పందించిన వాట్సాప్.. యూజర్ల ప్రైవసీనే తమకు ప్రధానమని స్పష్టం చేసింది. కొత్త ప్రైవసీ పాలసీతో యూజర్ల వ్యక్తిగత మెసేజ్‌ల ప్రైవసీకి భంగం వాటిల్లదని పేర్కొంది. రాబోయే రోజుల్లో వాట్సాప్‌ యాక్టివిటీలో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలిపింది.

యూజర్లకు ప్రైవసీ పాలసీపై ఎప్పటికప్పుడూ అప్‌డేట్‌ను ఇస్తూనే ఉంటామని స్పష్టం చేసింది. పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ చట్టం అమల్లోకి వచ్చేంతవరకు వాట్సాప్‌ అకౌంట్లు, ఫీచర్లలో ఎలాంటి మార్పు ఉండబోదని  తెలిపింది. కొత్త ప్రైవసీ పాలసీని ఇంకా ఆమోదించని యూజర్ల అకౌంట్లు ఎప్పటిలానే పనిచేస్తాయని పేర్కొంది.

వాట్సాప్‌ ప్రవేశపెట్టిన ప్రైవసీ పాలసీపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. భారత్‌లో మే 15 నుంచి అమలు చేయాలని వాట్సాప్‌ సూచించిన కొత్త ప్రైవసీ పాలసీని విత్‌డ్రా చేసుకోవాలంటూ కేంద్రం ఈ నెల 18న వాట్సాప్‌ కంపెనీకి లేఖ పంపింది. యూజర్ల ప్రైవసీకి సంబంధించి వారంలోగా వివరణ ఇవ్వాలని సూచించింది. లేదంటే చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది.

ట్రెండింగ్ వార్తలు