iPhone 17 Series : కొత్త ఐఫోన్ 17 సిరీస్ కావాలా? ఆన్‌లైన్‌లో ఇలా ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.. ఇదిగో సింపుల్ గైడ్..!
iPhone 17 Series : భారత మార్కెట్లో సెప్టెంబర్ 12 సాయంత్రం 5:30 గంటలకు ఐఫోన్ 17 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయని ఆపిల్ ప్రకటించింది.

iPhone 17 Series
iPhone 17 Series Pre-Booking : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఆపిల్ ‘అవే డ్రాపింగ్’ ఈవెంట్‌లో ఐఫోన్ 17 సిరీస్ ఎట్టకేలకు లాంచ్ చేసింది. ఈ లైనప్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఉన్నాయి.
ఈ 4 ఐఫోన్ మోడళ్లూ కొత్త డిజైన్లు, పవర్ ఫుల్ చిప్‌లు, ఆకర్షణీయమైన కెమెరాలు, ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్‌తో వస్తాయి. భారతీయ కొనుగోలుదారులు ఈ కొత్త ఐఫోన్ 17 సిరీస్ సేల్ కు ముందు ఆన్‌లైన్‌లో ఎలా ప్రీ-బుక్ చేసుకోవాలి? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఐఫోన్ 17 సిరీస్ భారత్ ధరలివే :
ఐఫోన్ 17 ధర 256GB వేరియంట్ ధర రూ.82,900 నుంచి ప్రారంభమై 512GB ఆప్షన్ ధర రూ.1,02,900 వరకు ఉంటుంది. ఐఫోన్ 17 ఎయిర్ 256GB ధర రూ.1,19,900, 512GB ధర రూ.1,39,900, టాప్-ఎండ్ 1TB మోడల్ ధర రూ.1,59,900 నుంచి లభ్యమవుతుంది.
ఐఫోన్ ప్రో మోడళ్ల విషయానికి వస్తే.. ఐఫోన్ 17 ప్రో 256GBకి రూ.1,34,900, 512GBకి రూ.1,54,900, 1TBకి రూ.1,74,900 ధరకు లభిస్తుంది. చివరగా, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 256GBకి రూ.1,49,900 నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 512GBకి రూ.1,69,900, 1TBకి రూ.1,89,900, 2TB వెర్షన్‌కి రూ.2,29,900 ధరతో లభిస్తుంది.
iPhone 17 Series : భారత్‌లో ఎప్పుడు ప్రీ-బుక్ చేసుకోవాలి?
భారత మార్కెట్లో సెప్టెంబర్ 12 శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు ఐఫోన్ 17 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయని ఆపిల్ అధికారికంగా ప్రకటించింది. డెలివరీలు, స్టోర్లలో లభ్యత సెప్టెంబర్ 19 శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయి.
ఆన్‌లైన్‌లో ఐఫోన్ 17 సిరీస్ ప్రీ-బుకింగ్ ఎక్కడంటే? :
భారత మార్కెట్లో ఐఫోన్ 17 సిరీస్‌ను ఆన్‌లైన్‌లో ముందస్తుగా బుక్ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్ (apple.in), మీ ఆపిల్ ఐడీతో సైన్ ఇన్ చేయవచ్చు. మోడల్, కలర్, స్టోరేజీని ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్ చెల్లింపుతో మీ ఆర్డర్‌ను కన్ఫార్మ్ చేయొచ్చు.
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా, రిలయన్స్ డిజిటల్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు కూడా ప్రీ-ఆర్డర్‌లు, బ్యాంక్ ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ డీల్స్ అందిస్తాయి. అదనంగా, ఇమాజిన్, యునికార్న్ వంటి ఆపిల్ అధీకృత రీసేలర్లు, ఈఎంఐ, ట్రేడ్-ఇన్ ఆప్షన్లతో ఆన్‌లైన్ ప్రీ-బుకింగ్ పొందవచ్చు.
ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు వంటి నగరాల్లోని కొనుగోలుదారులు అధికారిక ఆపిల్ రిటైల్ స్టోర్ల నుంచి నేరుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో ఐఫోన్ 17 ప్రీ-బుకింగ్ ఎలా? :
- ఆపిల్ ఇండియా వెబ్‌సైట్ లేదా ఏదైనా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌కి వెళ్లండి.
- ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ మోడల్ ఎంచుకోండి.
- స్టోరేజీ వేరియంట్, కలర్ ఆప్షన్ ఎంచుకోండి.
- మీ బ్యాగ్/కార్ట్‌కి యాడ్ చేసి Checkout వెళ్లండి.
- UPI, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా ఈఎంఐ ఆప్షన్ ఉపయోగించి పేమెంట్ చేయండి.
- కన్ఫార్మ్ అయ్యాక మీరు డెలివరీ వివరాలతో అడ్వాన్స్ ఆర్డర్ కన్ఫార్మ్ ఇమెయిల్ వస్తుంది.