WhatsApp Feature : వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. ఇక పంపే ముందే మీ మెసేజ్‌లు హైడ్ అవుతాయి.. ఎలాగంటే?
WhatsApp Feature : వాట్సాప్‌లో సరికొత్త ప్రైవసీ ఫీచర్ రాబోతోంది. తద్వారా మీరు మెసేజ్ పంపే ముందు అందులోని ముఖ్యమైన కంటెంట్‌ను హైడ్ చేయొచ్చు. ఇదేలా పనిచేస్తుందంటే?
- Sreehari A
- Updated on- May 26, 2026 / 05:33 PM IST
WhatsApp Feature ( Image Credit : AI )
- వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్ వస్తోంది
- వాట్సాప్ స్పాయిలర్ ఫీచర్ బెనిఫిట్స్ ఏంటి?
- ఇదేలా పనిచేస్తుంది? ఎలా సెటప్ చేయాలి?
WhatsApp Feature : వాట్సాప్ యూజర్ల కోసం ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది. ఇక మీ మెసేజ్ లను డైరెక్ట్ ఎవరూ చూడలేరు. మీరు ఏదైనా మెసేజ్ గ్రూపు చాట్ లలో పంపితే అది వెంటనే చూడలేరు. ఆ మెసేజ్ అవతలి యూజర్ ట్యాప్ చేసి చూసేవరకు కనిపించదు. వాట్సాప్ మెసేజ్‌లలో సీక్రెట్ కంటెంట్‌ను హైడ్ చేసేందుకు ఈ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ కొత్త ప్రైవసీ ఫీచర్‌పై మెటా సొంత యాప్ పనిచేస్తున్నట్లు సమాచారం.
ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్ స్టేజీలో ఉంది. రాబోయే కొద్ది వారాల్లో బీటా టెస్టింగ్ రిలీజ్ (WhatsApp Feature) అవుతుందని భావిస్తున్నారు. వాట్సాప్ ఎప్పటికప్పుడూ తమ యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తోంది. ఇందులో భాగంగానే స్పాయిలర్ ఫీచర్ తీసుకువస్తోంది. ఇంతకీ ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? యూజర్లకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం..
ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? :
ఈ ఫీచర్ డెమో ప్రకారం.. కొత్త ఫార్మాటింగ్ టూల్‌గా రాబోతుంది. ఈ టూల్ ద్వారా మెసేజ్ పంపే ముందు ఎంచుకున్న టెక్స్ట్‌ను బ్లర్ లేయర్ బ్యాక్ హైడ్ చేయొచ్చు. ఈ మెసేజ్ కనిపించాలంటే అవతలి యూజర్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా మూవీలు, టీవీ షోలు, స్పోర్ట్ రిజల్ట్స్, ఇతర అంశాల సమాచారంపై హైప్ క్రియేట్ చేయొచ్చు. స్పాయిలర్ కంటెంట్‌ను పంపే ముందు ఇలా హైడ్ చేయొచ్చు.
ఈ ఫీచర్‌తో బెనిఫిట్స్ ఏంటి? :
నివేదికల ప్రకారం.. ఈ కొత్త ఫార్మాటింగ్ టూల్ టెక్స్ట్ మెసేజ్, మీడియా క్యాప్షన్‌లు రెండింటికీ వర్క్ అవుతుంది. భవిష్యత్తులో ఫొటోలు, వీడియోలను కూడా ఒకే చోట చేర్చవచ్చు. అంటే.. పంపే ముందు ఫొటోలు, వీడియోలను కూడా హైడ్ చేయొచ్చు.
Read Also : Samsung Galaxy S26 FE : ఫోన్ కాదు ఫ్యూచర్ లుక్ ఇది! కొత్త శాంసంగ్ ఫోన్ డిజైన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
తద్వారా గ్రూప్ చాట్‌లలో స్పాయిలర్‌లు (ముందుగానే తెలిసిపోవడం) తగ్గుతాయి. చాటింగ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రాబోయే కొద్ది నెలల్లో ఈ ఫీచర్ యూజర్లందరికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రైవసీ కోసం సరికొత్త ఫీచర్ :
కంటెంట్ హైడ్ చేసే ఫీచర్ మాదిరిగానే వాట్సాప్ కొత్త ప్రైవసీ ఫీచర్‌పై కూడా పనిచేస్తోంది. ‘ఆఫ్టర్ రీడింగ్’ అనే ఈ ఫీచర్ మెసేజ్‌లను చదివిన వెంటనే డిసప్పియర్ అవుతాయి. టైమర్‌ను సెట్ చేసుకోవచ్చు. తద్వారా మెసేజ్‌ను చదివిన వెంటనే డిసప్పియర్ అవుతుంది.
5 నిమిషాలు, 1 గంట, లేదా 12 గంటల గడువులను ఇలా సెట్ చేయవచ్చు. ఒకవేళ మెసేజ్ చదవకుండా ఉంటే.. అది 24 గంటల తర్వాత ఆటోమేటిక్‌గా డిసప్పియర్ అవుతుంది. ఇప్పటికే వాట్సాప్ అందించే డిసప్పియర్ మెసేజ్ ఫీచర్‌కు రాబోయే ఫీచర్ చాలా డిఫరెంట్ ఉంటుంది.
