Samsung Galaxy S26 FE : ఫోన్ కాదు ఫ్యూచర్ లుక్ ఇది! కొత్త శాంసంగ్ ఫోన్ డిజైన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Samsung Galaxy S26 FE : శాంసంగ్ నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. అధికారిక లాంచ్‌కు ముందే శాంసంగ్ గెలాక్సీ ఎస్26 ఎఫ్ఈ ఫీచర్లు లీక్ అయ్యాయి. భారత్, ధర, లాంచ్ టైమ్ వంటి వివరాలపై అంచనాలివే..
Samsung Galaxy S26 FE ( Image Credit : AI )
- శాంసంగ్ గెలాక్సీ S26 ఎఫ్ఈలో ట్రిపుల్ రియర్ కెమెరాలు, ఫ్లాట్ ఫ్రేమ్‌తో డిజైన్
- ఈ ఫోన్లో భారీ అమోల్డ్ డిస్ప్లే, ఏఐ ఫీచర్లు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- సుమారు రూ. 65వేల ధరతో సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో లాంచ్
Samsung Galaxy S26 FE : శాంసంగ్ లవర్స్ గెట్ రెడీ.. శాంసంగ్ కొత్త బడ్జెట్-ఫ్రెండ్లీ మోడల్ వచ్చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ S26 FE అతి త్వరలో లాంచ్ కానుంది. ప్రస్తుతం స్టాండర్డ్ గెలాక్సీ S26 మోడల్, గెలాక్సీ S26 ప్లస్, గెలాక్సీ S26 అల్ట్రా మోడల్స్ ఉండగా, ఈ S26 సిరీస్‌లో మరో కొత్త మోడల్ చేరనుంది. ఈ శాంసంగ్ ఫోన్ గురించి కంపెనీ ఎలాంటి వివరాలు రివీల్ చేయలేదు. శాంసంగ్ గెలాక్సీ S26 ఎఫ్ఈ డిజైన్ ఇటీవల ఆన్లైన్లో లీక్ అయింది.
లేటెస్ట్ లీక్‌ల ప్రకారం.. ప్రస్తుత శాంసంగ్ గెలాక్సీ S26 మోడల్‌ను పోలి ఉంటుంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ రియల్ కెమెరా సెటప్‌తో రానుంది. డిజైన్‌తో పాటు, డిస్ప్లే, పర్ఫార్మెన్స్, బ్యాటరీ కెమెరాలో కూడా అప్గ్రేడ్లు ఉండే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ S26 ఎఫ్ఈ గురించి పూర్తి ఫీచర్ వివరాలపై ఓసారి లుక్కేయండి..
శాంసంగ్ గెలాక్సీ S26 FE డిజైన్ (లీక్) :
శాంసంగ్ గెలాక్సీ S26 ఎఫ్ఈ ఫోన్ డిజైన్ రెండర్లు ఇటీవల థర్డ్-పార్టీ కేస్ తయారీ కంపెనీ ద్వారా లీక్ అయ్యాయి. లీక్ అయిన (Samsung Galaxy S26 FE) డిజైన్ రెండరింగ్లను పరిశీలిస్తే.. ఇటీవల లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ S26 లైనప్‌లో వాడిన అదే డిజైన్ స్టయిల్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎత్తైన కెమెరా ప్లాటూ, ఫ్లాట్ సైడ్ ఫ్రేమ్ మధ్యలో పంచ్ హోల్ కెమెరాతో సన్నని ఫ్రంట్ ప్యానెల్ ఉంటుంది.
లీకైన డిజైన్ రెండరింగ్ల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 3 కెమెరాలు వర్టికల్ అమర్చి ఉంటాయి. కేస్‌కు సంబంధించిన కొన్ని డిజైన్ రెండరింగ్లలో మాగ్నెటిక్ ఛార్జింగ్ రింగ్‌లు కూడా కనిపిస్తున్నాయి. అంటే.. మాగ్నెటిక్ యాక్సెసరీల ద్వారా Qi2 ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయవచ్చని తెలుస్తోంది.
Read Also : Oppo Find X9 : ఒప్పో ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. భారత్‌లో OPPO ఫోన్ల ధరలు పెరగనున్నాయా? ఇప్పుడే కొనడం బెటరా?
స్పెసిఫికేషన్లు (అంచనా) :
శాంసంగ్ గెలాక్సీ S26 ఎఫ్ఈలో 6.7 అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X ఫ్లాట్ ప్యానెల్ ఉంటుందని అంచనా. అడాప్టివ్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుందని అంచనా. అంతేకాదు.. స్క్రీన్‌ను గీతలు, కిందపడినా ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ కూడా ఉండవచ్చు.
హార్డ్‌వేర్ విషయానికి వస్తే.. :
శాంసంగ్ గెలాక్సీ S26 ఎఫ్ఈ పవర్ఫుల్ శాంసంగ్ ఎక్సినోస్ 2500 డెకా-కోర్ చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. అంతేకాదు.. 8GB ర్యామ్, 512GB స్టోరేజ్ స్పేస్ ఉండవచ్చు. అదనంగా, శాంసంగ్ S26 ఎఫ్ఈ, ఆండ్రాయిడ్ 17 ఆధారంగా అడ్వాన్స్ గెలాక్సీ ఏఐతో వన్ యూఐ 9తో రానుంది.
స్మార్ట్‌ఫోన్ పవర్ సప్లై విషయానికి వస్తే..
ఇందులో 55W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,100mAh లి-అయాన్ బ్యాటరీ ఉండవచ్చు. అంతేకాదు.. బ్యాటరీ కారణంగా వైర్లెస్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ S26 ఎఫ్ఈలో ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ లేదా ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఫేస్ అన్‌లాక్ సిస్టమ్ కూడా ఉండవచ్చు.
స్మార్ట్‌ఫోన్ ఆప్టికల్ కాన్ఫిగరేషన్ విషయానికొస్తే.. శాంసంగ్ S26 ఎఫ్ఈ 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 8MP టెలిఫోటో సెన్సార్‌తో వస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు.. ఈ ఫోన్ ఫ్రంట్ కెమెరాలో 12MP సెల్ఫీ కెమెరాతో రావొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S26 ఎఫ్ఈ లాంచ్ టైమ్, భారత్ ధర (అంచనా) :
శాంసంగ్ గెలాక్సీ S26 ఎఫ్ఈకి సంబంధించిన వివరాలను శాంసంగ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. లీకుల ప్రకారం.. ఈ శాంసంగ్ ఫోన్ 2026 సెప్టెంబర్, అక్టోబర్ మధ్య లాంచ్ కావచ్చు. ధర విషయానికి వస్తే.. సుమారు రూ. 65వేల ధరతో లాంచ్ కావచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.
