×
Ad

WhatsApp New Feature : వాట్సాప్‌లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. ఇక పాస్‌వర్డులతో మీ అకౌంట్ ఫుల్ సేఫ్.. ఎలాగంటే?

WhatsApp New Feature : వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త సెక్యూరిటీ ఫీచర్ వస్తోంది. లాగిన్ ప్రొటెక్షన్ కోసం 6 నుంచి 20 క్యారెక్టర్ల ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్‌ సెటప్ ఎంచుకోవచ్చు..

  • Published On : February 23, 2026 / 07:54 PM IST

WhatsApp New Feature

  • అదనపు లాగిన్ ప్రొటెక్షన్ కోసం 6–20 అక్షరాల ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్‌ సెటప్
  • వెరిఫికేషన్ కోడ్, టూ-ఫ్యాక్టర్డ్ పిన్ ఎనేబుల్ చేస్తే ఈ పాస్‌వర్డ్ తప్పనిసరి
  • వాట్సాప్ ఆండ్రాయిడ్, iOS మెసేజ్ షెడ్యూలింగ్, స్పాయిలర్ టెక్స్ట్ ఫీచర్లు

WhatsApp New Feature : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. వాట్సాప్ అకౌంట్లు మరింత ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. వాట్సాప్ తమ యూజర్ల అకౌంట్లకు ఫుల్ సెక్యూరిటీ అందించే ఫీచర్ తీసుకొస్తోంది.

ఈ కొత్త సెక్యూరిటీ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. మెటా యాజమాన్యంలోని ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వెరిఫికేషన్ సిస్టమ్ కు అదనపు సెక్యూరిటీ లేయర్ యాడ్ చేయనున్నట్టు తెలిపింది.

అయితే, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఇటీవలే బీటా అప్‌డేట్ రిలీజ్ అయింది. ఆండ్రాయిడ్ యూజర్లు తమ వాట్సాప్ యాప్ సెట్టింగ్స్ నుంచి నేరుగా ఆల్ఫాన్యూమరిక్ ఖాతా పాస్‌వర్డ్‌ సెట్ చేసుకోవచ్చు.

వాట్సాప్ పాస్‌వర్డ్ 6 నుంచి 20 క్యారెక్టర్లు లాంగ్ : 
WaBetaInfo ప్రకారం.. పాస్‌వర్డ్ 6 నుంచి 20 అక్షరాల పొడవు ఉండాలి. కనీసం ఒక అక్షరం, ఒక సంఖ్య ఉండాలి. ఈ ఫీచర్ ఆప్షనల్ మాత్రమే. వినియోగదారులు అదనపు ప్రొటెక్షన్ అవసరమైతే ఎనేబుల్ చేసుకోవచ్చు.

యాక్టివేట్ తర్వాత లాగిన్ సమయంలో స్టాండర్డ్ 6 అంకెల వెరిఫై కోడ్‌ను ఎంటర్ చేసిన తర్వాత పాస్‌వర్డ్ అవసరం అవుతుంది. కొత్తగా క్రియేట్ చేసిన అకౌంట్ పాస్‌వర్డ్ కోసం ప్రాంప్ట్ చేసే ముందు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ యూజర్ల నుంచి వాట్సాప్ ముందుగా టూ ఫ్యాక్టర్ పిన్ అడుగుతుంది.

ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్ స్టేజీలో ఉంది. ఫ్యూచర్ అప్‌డేట్‌లో ఈ ఫీచర్ రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు. అకౌంట్ సెక్యూరిటీ ఈ ఫీచర్ చాలా అవసరం. ముఖ్యంగా SIM స్వాప్ మోసం లేదా అనధికార లాగిన్ వంటివి నివారించవచ్చు.

మెసేజ్ షెడ్యూల్ ఫీచర్ కూడా :
వాట్సాప్ యూజర్ల మెసేజ్ లను షెడ్యూల్ చేసేందుకు కొత్త ఫీచర్‌పై వర్క్ చేస్తోంది. వినియోగదారులు తమ మెసేజ్ ఆటోమాటిక్ గా పంపేందుకు నిర్దిష్ట తేదీ, టైమ్ ఎంచుకోవచ్చు. నివేదిక ప్రకారం.. షెడ్యూల్ మెసేజ్ చాట్ డేటా స్పెషల్ సెక్షన్ లో కనిపిస్తాయి. వినియోగదారులు మెసేజ్ డెలివరీ చేసే ముందు రివ్యూ చేయడం లేదా డిలీట్ చేసుకోవచ్చు.

అదనంగా, కంపెనీ ఆండ్రాయిడ్, iOSలలో మెసేజ్‌ల కోసం కొత్త స్పాయిలర్ ఫార్మాటింగ్‌పై పనిచేస్తోంది. వినియోగదారులు మెసేజ్ టెక్ట్స్ హైడ్ చేయడం కంటెంట్‌ను పబ్లీష్ చేసేందుకు దానిపై ట్యాప్ చేయొచ్చు.