WhatsApp Backup : పండగ చేస్కోండి.. గూగుల్ డ్రైవ్‌కు గుడ్‌బై? ఇక వాట్సాప్‌లోనే ‘చాట్ బ్యాకప్’ కొత్త ఫీచర్..!

WhatsApp Backup : వాట్సాప్ సరికొత్త ఫీచర్ రాబోతుంది. కంపెనీ సొంత క్లౌడ్ బ్యాకప్ సిస్టమ్‌పై వర్క్ చేస్తోంది. తద్వారా యూజర్లు తమ చాట్‌లు, డేటాను నేరుగా వాట్సాప్ సర్వర్‌లలో స్టోర్ చేసుకోవచ్చు.

WhatsApp Backup

  • వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్
  • గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్ సర్వీసులతో పనిలేదు
  • వాట్సాప్ లోనే మీ చాట్ డేటా స్టోర్ చేసుకోవచ్చు

WhatsApp Backup : వాట్సాప్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. ఇకపై వాట్సాప్ డేటా బ్యాకప్ విషయంలో డోంట్ వర్రీ.. వాట్సాప్ చాట్‌లు, ఫోటోలు, వీడియోలు, ముఖ్యమైన ఫైల్స్ అన్నీ ఈ యాప్‌లోనే స్టోర్ అవుతాయి. అంటే.. గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్ సర్వీసులపై ఆధారపడాల్సిన పనిలేదు.

ప్రస్తుతం వాట్సాప్ యూజర్లు డేటా బ్యాకప్ విషయంలో స్టోరేజ్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇకపై అలాంటి ఇబ్బంది ఉండదు. అతి త్వరలోనే గూగుల్ డ్రైవ్ లేకుండానే మీ వాట్సాప్ డేటాను బ్యాకప్ స్టోర్ చేసుకోవచ్చు.. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

గూగుల్ డ్రైవ్ ఐక్లౌడ్‌పై మరింత భారం :
ప్రస్తుతం, ఆండ్రాయిడ్ యూజర్లు తమ డేటాను గూగుల్ డ్రైవ్‌లో బ్యాకప్ చేస్తున్నారు. ఐఫోన్ యూజర్లు ఐక్లౌడ్‌ను వాడుతున్నారు. ఇందులో సమస్య ఏమిటంటే.. ఈ క్లౌడ్ సర్వీసులు కేవలం వాట్సాప్ స్టోరేజ్‌ను మాత్రమే స్టోర్ చేయవు. ఫొటోలు, వీడియోలు ఇతర యాప్‌ల నుంచి డేటా కూడా ఉంటాయి. ఫ్రీ స్టోరేజ్ నిండిపోయినప్పుడు యూజర్లు పాత డేటాను డిలీట్ చేయాలి లేదా అదనపు స్టోరేజ్ కోసం పేమెంట్ చేయాల్సి వస్తుంది.

Read Also : New LPG Cylinder Rules : మే 1 నుంచి ఎల్పీజీ కొత్త రూల్స్.. .. ఇక OTP చెబితేనే సిలిండర్ డెలివరీ.. బుకింగ్ గ్యాప్, ధరల్లో మార్పులు!

వాట్సాప్ సొంత క్లౌడ్ బ్యాకప్ సిస్టమ్ :
నివేదికల ప్రకారం.. వాట్సాప్ సొంత క్లౌడ్ బ్యాకప్ సిస్టమ్‌పై పనిచేస్తోంది. తద్వారా యూజర్లు తమ చాట్‌లు, డేటాను నేరుగా వాట్సాప్ సర్వర్‌లలో స్టోర్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ డిఫాల్ట్‌గా ఎనేబుల్ అయి ఉంటుంది. యూజర్ల డేటాకు ఫుల్ సేఫ్టీ అనమాట.

యూజర్లకు ఫుల్ బ్యాకప్ ఆప్షన్ :
భవిష్యత్తులో, వాట్సాప్ యూజర్లు తమ బ్యాకప్‌లను గూగుల్ డ్రైవ్‌లో లేదా వాట్సాప్ సొంత క్లౌడ్‌లో స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. బ్యాకప్ మేనేజ్ అనేది చాలా ఈజీ కానుంది. కొత్త అప్‌డేట్‌లో భాగంగా వాట్సాప్ 2GB వరకు ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్‌ను అందించవచ్చు.

అయితే, ఈ ఫీచర్ యూజర్లందరికి అందుబాటులో ఉంటుందా లేదా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి మాత్రమేనా అనేది ఇంకా క్లారిటీ లేదు. వాట్సాప్ సుమారు 0.99 డాలర్లకే 50GB వరకు స్టోరేజ్‌తో పెయిడ్ ప్లాన్‌ అందించనుంది. అధిక సంఖ్యలో మీడియా ఫైల్స్ ఉన్న యూజర్లకు ఈ ప్లాన్ బెస్ట్.

సేఫ్టీ కోసం అడ్వాన్స్ ఎన్‌క్రిప్షన్ ఆప్షన్ :
వాట్సాప్ కొత్త బ్యాకప్ సిస్టమ్‌తో యూజర్లకు ఫుల్ సేఫ్టీ ఉంటుంది. యూజర్లు తమ డేటాను పాస్‌కీ, పాస్‌వర్డ్ లేదా 64-అంకెల ఎన్‌క్రిప్షన్ కీతో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ప్రతి సందర్భంలోనూ డేటా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతుంది. ఇందులో థర్డ్ పార్టీ యాక్సెస్ చేయడం దాదాపు అసాధ్యం.

ఈ కొత్త ఫీచర్ ఎప్పుడు వస్తుంది? :
ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్ స్టేజీలో ఉంది. ప్రారంభంలో బీటా యూజర్లకు రిలీజ్ కానుంది. టెస్టింగ్ పూర్తయిన తర్వాత రెగ్యులర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత వాట్సాప్ బ్యాకప్‌లు మరింత ఈజీగా సురక్షితంగా మారతాయి. వినియోగదారులకు తమ డేటాపై మరింత కంట్రోలింగ్ లభిస్తుంది.