WhatsApp New Feature : ఇక బ్లూ టిక్ భయం లేదు.. వాట్సాప్‌లో చాట్ ఓపెన్ చేయకుండానే మెసేజ్‌లు చదవొచ్చు.. ఎలాగంటే?
WhatsApp New Feature : వాట్సాప్‌లో సరికొత్త చాట్ ప్రివ్యూ ఫీచర్ రాబోతోంది. చాట్ ఓపెన్ చేయకుండానే మెసేజ్‌లు చదవొచ్చు. అవతలి వ్యక్తికి బ్లూ టిక్ వెళ్లదు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం..
- Sreehari A
- Published on- November 6, 2026 / 06:29 PM IST
WhatsApp New Feature
- వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్..
- బ్లూ టిక్ పడకుండా మెసేజ్‌లు చదివొచ్చు
- వాట్సాప్‌లో సైలెంట్‌గా సరికొత్త ఫీచర్
- మెసేజ్ చదివినా ఎదుటివారికి తెలియదు
WhatsApp New Feature : వాట్సాప్ వాడుతున్నారా? అయితే మీకోసం ఖతర్నాక్ అప్డేట్ రాబోతోంది. ఒక్కోసారి వాట్సాప్‌లో మెసేజ్ వస్తే.. వెంటనే చదవాలని ఉంటుంది. కానీ, చాట్ ఓపెన్ చేస్తే అవతలి వ్యక్తికి బ్లూ టిక్ వెళ్లిపోతుంది. దీంతో మెసేజ్ చదివినా వెంటనే రిప్లయ్ ఇవ్వాల్సిన పరిస్థితి..
ఇకపై ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది.. ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే చాట్ ఓపెన్ చేయకుండానే మెసేజ్‌లు హాయిగా చదవొచ్చు. పైగా అవతలి వ్యక్తికి బ్లూ టిక్ కూడా కనిపించదు.. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుంది? :
ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ చాట్‌పై ఎక్కువసేపు ట్యాప్ చేసి పట్టుకుంటే పిన్, ఆర్కైవ్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. అయితే, కొత్త ఫీచర్లో కూడా ఇదే విధానంతో ఉంటుంది.. చాట్‌పై లాంగ్ ప్రెస్ చేయగానే చిన్న ప్రివ్యూ కార్డు కనిపిస్తుంది. అందులో లేటెస్ట్ చాట్ మెసేజ్‌లను చూడొచ్చు. ఇందుకోసం పూర్తిగా చాట్‌లోకి వెళ్లాల్సిన పనిలేదు..
ఇలా ప్రివ్యూలో మెసేజ్‌లు చదివినంత మాత్రాన రీడ్ రిసీట్స్ అప్డేట్ కావు. అంటే.. అవతలి వ్యక్తికి బ్లూ టిక్ వెళ్లదు. సాధారణంగా చాట్ ఓపెన్ చేసినప్పుడే మెసేజ్ చదివినట్లు లెక్క..
ఇంకా ఏయే ఆప్షన్లు ఉండొచ్చు :
ప్రివ్యూ కార్డు కింద కనిపించే మెనూలో చాట్‌ను పిన్ చేయడం, ఆర్కైవ్ చేయడం, మ్యూట్ చేయడం, డిలీట్ చేయడం వంటి ఆప్షన్లు ఉంటాయి. అంతేకాదు.. మెసేజ్‌లను రీడ్ లేదా అన్‌రీడ్‌గా మార్క్ చేయడం, చాట్ లాక్ చేయడం, హోమ్ స్క్రీన్‌పై షార్ట్‌కట్ క్రియేట్ చేయడం వంటి ఫీచర్లు కూడా ఉండొచ్చు..
అయితే ఈ సరికొత్త ఫీచర్ ప్రస్తుతం డెవలప్ స్టేజీలోనే ఉంది. (WABetaInfo) రిపోర్టు ప్రకారం.. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.44.11లో గుర్తించారు. ఇంకా బీటా యూజర్లకు కూడా అందుబాటులోకి రాలేదు. అతి త్వరలోనే అందరికీ వస్తుందని చెప్పలేం.. అధికారికంగా రిలీజ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే..
