WhatsApp New Feature : వాట్సప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్
ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లకు అందుబాటులో ఉంటున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ ఈసారి అదిరిపోయే ఫీచర్ ను తన యూజర్లకు అందించేందుకు సిధ్దమవుతోంది.
- chvmurthy
- Published On : May 8, 2022 / 07:27 PM IST
Whats App
WhatsApp New Feature : ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లకు అందుబాటులో ఉంటున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ ఈసారి అదిరిపోయే ఫీచర్ ను తన యూజర్లకు అందించేందుకు సిధ్దమవుతోంది. మెసేజింగ్ ప్లాట్ ఫారమ్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చే లక్ష్యంతో ఇప్పటికే కమ్యునిటీ గ్రూప్ ఛాట్ పేరుతో అధునాతన ఫీచర్ ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.
ఇప్పడు తాజాగా వాట్సప్ గ్రూపుల్లోని సభ్యుల సంఖ్యను రెట్టింపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు వాట్సప్ గ్రూపుల్లో 256 మంది సభ్యులకు మాత్రమే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సంఖ్యను 512 కు పెంచుతోంది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం కొద్ది మంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉందని వాట్సప్ తెలిపింది. త్వరలో ఈ ఫీచర్ ను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకు రానున్నట్లు పేర్కోంది.
Also Read : WhatsApp: వాట్సప్‌లో కమ్యూనిటీలు, గ్రూప్స్ కోసం మరో 4ఫీచర్లు
