WhatsApp: వాట్సప్‌లో కమ్యూనిటీలు, గ్రూప్స్ కోసం మరో 4ఫీచర్లు

సపరేట్స్ గ్రూప్స్ తో ఉన్న అందరినీ ఒకే చోటుకి తెచ్చే ప్రయత్నంలో వాట్సప్ కమ్యూనిటీస్ ఫీచర్ ను తీసుకొచ్చింది. మెటా గ్రూపుకు చెందిన ఈ మెసేజ్ ప్లాట్ ఫాం దీంతో పాటు గ్రూపుల కోసం మరో 4..

WhatsApp: వాట్సప్‌లో కమ్యూనిటీలు, గ్రూప్స్ కోసం మరో 4ఫీచర్లు

Whatsapp Eta Feature Whatsapp Is Rolling Out A New Eta Feature For Beta Users

WhatsApp: సపరేట్స్ గ్రూప్స్ తో ఉన్న అందరినీ ఒకే చోటుకి తెచ్చే ప్రయత్నంలో వాట్సప్ కమ్యూనిటీస్ ఫీచర్ ను తీసుకొచ్చింది. మెటా గ్రూపుకు చెందిన ఈ మెసేజ్ ప్లాట్ ఫాం దీంతో పాటు గ్రూపుల కోసం మరో 4ఫీచర్లు తీసుకొచ్చింది. అడ్మిన్ డిలీట్, లార్జ్ వాయీస్ కాల్స్, మెసేజ్ రియాక్షన్స్, లార్జ్ ఫైల్ షేరింగ్ లాంటివి అందుబాటులోకి తెచ్చింది.

“మొత్తం కమ్యూనిటీకి పంపిన అప్‌డేట్‌లను చూడటానికి లేదంటే.. ముఖ్యమైన వాటిని మాత్రమే రిసీవ్ చేసుకునే వీలుంది. చిన్నపాటి మీటింగ్ గ్రూపులను సులభంగా నిర్వహించడానికి అనుమతిస్తాయి” అని కంపెనీ అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. ఈ ఫీచర్ అడ్మిన్‌ల కోసం కొత్త టూల్స్‌ని కూడా తీసుకొస్తుంది. అందరికీ పంపించే ప్రకటన సందేశాలు, ఏయే గ్రూప్‌లను చేర్చుకోవచ్చో కంట్రోల్ చేసుకోవచ్చు.

ఫీచర్‌తో, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ పాఠశాలలు, స్థానిక క్లబ్‌లు, లాభాపేక్షలేని సంస్థలు అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలనే లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదు.

“పాఠశాల ప్రిన్సిపాల్‌ పేరెంట్స్ అందరికీ మెసేజ్ చేయాలనుకున్నా.. ప్రత్యేక క్లాసులు, ఎక్స్ ట్రా యాక్టివిటీలు తెలియజేయాలనుకున్నా, వాలంటరీ అవసరాలున్నా సులభంగా పంచుకోవచ్చని భావిస్తున్నాము” అని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ బ్లాగ్‌లో పేర్కొన్నారు.

Read Also: యూపీఐ పిన్‌ను వాట్సప్‌తో మార్చుకోండిలా..

కొత్త వాట్సాప్ గ్రూప్ ఫీచర్లు
వాట్సాప్ గ్రూప్‌ల కోసం రియాక్షన్‌లు, అడ్మిన్ డిలీట్, ఫైల్ షేరింగ్, పెద్ద వాయిస్ కాల్‌లతో సహా నాలుగు కొత్త ఫీచర్‌లను యాడ్ చేయనుంది.

పెద్ద ఫైల్ షేర్ చేసుకోవడం:
యూజర్లు ఏ ఫైల్‌ను అప్‌లోడ్ చేయడం గానీ డౌన్‌లోడ్ చేసినప్పుడు ఫైల్ లోడింగ్ ఎస్టిమేటెడ్ టైమ్ ఎంతసేపు ఉంటుందో ఫీచర్ చూడొచ్చు. ఎంతసేపు డౌన్‌లోడ్ అవుతుందో ఈ ఫీచర్ టైమింగ్ కౌంట్ చూపిస్తుంది. కొత్తగా 2GB ఫైల్ షేరింగ్ ఆప్షన్ ద్వారా లార్జ్ ఫైల్స్ క్షణాల వ్యవధిలో షేర్ చేయొచ్చు.

లార్జ్ వాయీస్ కాల్స్:
గతంలో నలుగురికి మాత్రమే కాల్ చేసుకునే వీలు నుంచి ఎనిమిది మందికి పెంచిన వాట్సప్ ఈసారి 32మందికి కాల్ కనెక్ట్ చేసుకునే అవకాశం కల్పించింది.

లభ్యత విషయానికొస్తే, ఈ ఫీచర్లు “రాబోయే వారాల్లో అందుబాటులోకి రానున్నాయి కాబట్టి కమ్యూనిటీలు సిద్ధంగా ఉండక ముందే ప్రజలు వాటిని ప్రయత్నించడం ప్రారంభించవచ్చు” అని WhatsApp తెలిపింది. ఈ ఫీచర్‌లు బీటా వినియోగదారుల కోసం అందుబాటులోకి వస్తాయి, ఆ తర్వాత స్థిరమైన విడుదల ఉంటుంది.