Whatsapp Update : ఇక ఫోన్ నెంబర్‌తో పనిలేదు భయ్యా.. వాట్సాప్ ‘యూజర్‌నేమ్’తోనే చాటింగ్.. ఎలా పనిచేస్తుంది? బెనిఫిట్స్ ఏంటి?

Whatsapp Update : వాట్సాప్ అద్భుతమైన అప్‌డేట్‌తో వస్తోంది. త్వరలో వినియోగదారులు ఫోన్ నెంబర్ లేకుండానే చాటింగ్ చేయొచ్చు. రాబోయే ఈ అప్‌గ్రేడ్ సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

Whatsapp Update

  • వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్
  • మొబైల్ నెంబర్ లేకుండానే చాటింగ్ చేసుకోవచ్చు
  • యూజర్ నేమ్ ద్వారానే ఇకపై యూజర్లు కనెక్ట్ అవ్వొచ్చు

Whatsapp Update : వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఇకపై మొబైల్ నెంబర్లతో పనిలేదు. వాట్సాప్ యూజర్ నేమ్ ద్వారానే చాటింగ్ చేసుకోవచ్చు. అతి త్వరలోనే ఈ ఫీచర్ అందరికి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం యూజర్ నేమ్ ఆధారిత కమ్యూనికేషన్ ఫీచర్ టెస్టింగ్ చేస్తోంది. యూజర్ల ప్రైవసీ కోసం ఫోన్ నెంబర్ స్థానంలో యూజర్ నేమ్ ఉండేలా సెట్ చేయనుంది.

ఇలా చేస్తే యూజర్ల ప్రైవసీకీ మరింత సెక్యూరిటీ ఉంటుందని మెటా సొంత మెసేజింగ్ యాప్ వాట్సాప్ భావిస్తోంది. చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లకు యూజర్‌నేమ్ ఆధారిత ప్రొఫైల్‌లు ఎలా పనిచేస్తాయో తెలిసే ఉంటుంది.

కానీ, వాట్సాప్‌లో కీలకమైన అప్‌డేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్లాట్‌ఫామ్ ప్రారంభం నుంచి కేవలం ఫోన్ నంబర్లపైనే ఆధారపడుతూ వస్తోంది. ఇకపై కేవలం యూజర్ నేమ్ ఆధారంగానే ప్లాట్‌ఫారంపై అన్ని జరగనున్నాయి.

వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది? :

యూజర్‌నేమ్ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉందని వాట్సాప్ ధృవీకరించింది. తద్వారా వినియోగదారులు చాటింగ్ కోసం తమ ఫోన్ నంబర్‌ను ఇతరులకు షేర్ చేయాల్సిన అవసరం ఉండదు.
తమ మొబైల్ నంబర్ ఇతరులకు ఎక్కడ తెలిసిపోతుందనే ఆందోళన అవసరం ఉండదు. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు ఫోన్ నంబర్ లేకుండా వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఐడెంటిటీ పరంగా స్పెషల్ యూజర్‌నేమ్‌ మాత్రమే అందరికి కనిపిస్తుంది.

Read Also : Aadhaar App : ప్రతి కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్ యాప్ మస్ట్? ప్రభుత్వ ప్లాన్‌కు ఆపిల్, శాంసంగ్ షాకింగ్ రియాక్షన్!

వాట్సాప్‌లో యూజర్‌నేమ్ ఫీచర్ అనేది ఆప్షనల్ మాత్రమే.. అంటే ప్రైవసీ ఫీచర్‌గా అందుబాటులో ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. గతంలో ఈ ఫీచర్ వాట్సాప్ బిజినెస్ యూజర్ల కోసం మాత్రమేని భావించారు. అలా కాకుండా ఇప్పుడు రెగ్యులర్ వాట్సాప్ యూజర్లందరికి కూడా అందుబాటులోకి రానుందని చెబుతున్నారు.

కొత్త ఫీచర్ వచ్చేది ఎప్పుడంటే? :

మీడియా రిపోర్టుల ప్రకారం.. వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్ సుమారుగా 2026 జూన్‌లో అందుబాటులోకి వస్తుందని అంచనా. అయితే, ఈ ఫీచర్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి ముందే యూజర్‌నేమ్‌ను రిజర్వ్ చేసుకునే సదుపాయాన్ని కంపెనీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

యూజర్లకు, బిజినెస్ అకౌంట్లకు యూజర్‌నేమ్ ఎలా? :
వాట్సాప్ యూజర్లకు యూజర్‌నేమ్ చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే.. వారు ప్లాట్‌ఫారమ్‌లో కొత్త వారితో కనెక్ట్ అయ్యేటప్పుడు ఇకపై ఫోన్ నంబర్‌ను షేర్ చేయనవసరం లేదు. అదే బిజినెస్ కోసం ఏదైనా సర్వీసు పొందాలన్నా ఒక గ్రూప్‌లో జాయిన్ అవ్వాలన్నా లేదా కాల్ చేయాలన్నా యూజర్‌నేమ్ అనేది యూజర్ ఐడెంటిటీగా పనిచేస్తుంది.

అయితే, బిజినెస్ అకౌంట్ల కోసం వాట్సాప్ ప్రతి యూజర్ కోసం స్పెషల్ ఐడీ బిజినెస్-స్కోప్డ్ యూజర్ ఐడీ (BSUID)ని ప్రవేశపెడుతోంది. బిజినెస్ అకౌంట్లు ఈ ఐడీతో ఉపయోగించి ఫోన్ నంబర్ అవసరం లేకుండానే యూజర్లను గుర్తించి వారికి మెసేజ్ పంపవచ్చు. @HDFCBank వంటి బ్రాండ్ హ్యాండిల్స్ ద్వారా వినియోగదారులు నంబర్లను షేర్ చేయకుండా నేరుగా బిజినెస్ గుర్తించి వారికి మాత్రమే మెసేజ్ పంపవచ్చు.