AI Smart Glasses : AI గ్లాసెస్‌తో నో సీక్రెట్ రికార్డింగ్.. ZuckOff యాప్ ఇట్టే పసిగట్టేస్తుంది..!
AI Smart Glasses : ఏఐ స్మార్ట్ గ్లాసెస్‌తో రహస్యంగా రికార్డింగ్ జరుగుతుందనే భయాల మధ్య ZuckOff యాప్ అందుబాటులోకి వచ్చింది. మీ సమీపంలోని రే-బ్యాన్ మెటా, ఓక్లే మెటా, స్నాప్ స్పెక్టికల్ వంటి డివైజ్‌లను గుర్తించి యూజర్లను హెచ్చరిస్తుంది.
- Sreehari A
- Published on- September 15, 2026 / 09:44 PM IST
AI Smart Glasses
- మీ అనుమతి లేకుండా AI గ్లాసెస్‌తో రికార్డింగ్ చేసినా తెలుస్తుంది
- మీ చుట్టూ స్మార్ట్ గ్లాసెస్ ఉన్నాయా? వెంటనే అలర్ట్ చేసే యాప్ ఇదే
- ప్రైవసీకి కొత్త కవచం.. AI స్మార్ట్ గ్లాసెస్‌ను ఈ యాప్ గుర్తించగలదు
AI Smart Glasses : ఏఐ గ్లాసెస్‌తో సీక్రెట్ రికార్డింగ్ చేయొచ్చా? ఇప్పుడు ఇదే పెద్ద చర్చనీయాంశంగా మారింది. కెమెరాలతో వస్తున్న స్మార్ట్ గ్లాసెస్ పెరుగుతున్న నేపథ్యంలో.. తమకు తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీస్తున్నారేమోనన్న ఆందోళన చాలామందిలో కనిపిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా పోలిష్ డెవలపర్ పావెల్ షైడోల్వ్‌స్కీ రూపొందించిన ZuckOff అనే ప్రైవసీ యాప్ ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ డివైజ్‌లను జుక్‌ఆఫ్ గుర్తించగలదు :
ఈ యాప్ ప్రధానంగా బ్లూటూత్ సిగ్నల్స్‌ను స్కాన్ చేసి సమీపంలోని స్మార్ట్ వేరబుల్స్‌ను గుర్తిస్తుంది. కెమెరాలతో సపోర్టు చేసే స్మార్ట్ గ్లాసెస్ దగ్గరలో ఉన్నట్లు గుర్తించి వెంటనే యూజర్లను అలర్ట్ చేస్తుంది. ప్రస్తుతం Ray-Ban Meta, Oakley Meta, Snap Spectacles వంటి డివైజ్‌లను గుర్తించగలదని డెవలపర్ చెబుతున్నారు. కొన్ని డిస్‌ప్లే గ్లాసెస్, హెడ్‌సెట్లను కూడా యాప్ పసిగట్టగలదు.
Read Also : Oppo F35 Series : కొత్త ఒప్పో F35 సిరీస్ వస్తోందోచ్.. కీలక ఫీచర్లు లీక్.. ఈ నెల 16నే లాంచ్.. ఫుల్ డిటెయిల్స్
డివైజ్ ఉందని మాత్రమే చెప్పగలదు.. :
అయితే, ముఖ్యమైన విషయం ఏంటంటే.. జుక్‌ఆఫ్ సమీపంలోని వ్యక్తి మిమ్మల్ని నిజంగా రికార్డ్ చేస్తున్నాడని మాత్రం కన్ఫార్మ్ చేయలేదు. ఈ డివైజ్ సమీపంలో ఉందనే ఇండికేషన్ మాత్రమే గుర్తించి అలర్ట్ ఇవ్వగలదు. అలాగే మెటా క్వెస్ట్, ఆపిల్ విజన్ ప్రో వంటి డివైజ్‌లు లాగ్‌లో కనిపించినప్పటికీ వాటిని రికార్డింగ్ డివైజ్‌లుగా పరిగణించదు.
ఇక (Ray-Ban Meta) గ్లాసెస్‌లో రికార్డింగ్ సమయంలో కనిపించే క్యాప్చర్ ఎల్ఈడీ ప్రైవసీ కోసం కీలకమైన ఫీచర్ అందిస్తోంది. ఈ ఎల్ఈడీలో ట్యాంపరింగ్‌ను గుర్తించినప్పుడు కెమెరా పనిచేయకుండా చేసే సెక్యూరిటీ యాక్షన్స్ మెటా అందిస్తోంది. జుక్ ఆఫ్ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏఐ స్మార్ట్ గ్లాసెస్ వినియోగం పెరుగుతున్న వేళ వ్యక్తిగత ప్రైవసీపై అవగాహన పెంచే మరో టూల్ గా ఈ యాప్ నిలుస్తుందా అనేది చూడాలి.
