WWDC 2026 : ఐఫోన్ 11 యూజర్లకు పండగే..! iOS 27 అప్‌డేట్, Siri AI సపోర్ట్.. మీ ఫోన్ లిస్ట్‌లో ఉందా?

WWDC 2026: WWDC 2026లో ఆపిల్ iOS 27, ఆపిల్ ఇంటెలిజెన్స్‌, సిరి వంటి కీలక అప్‌డేట్‌లను ఆవిష్కరించింది. ఐఫోన్ 11 తర్వాతి మోడళ్లకు iOS 27 సపోర్టు చేస్తుందని కంపెనీ ధృవీకరించింది. సిరి ఇప్పుడు ఏఐ సిస్టమ్‌గా అప్‌గ్రేడ్ అయింది.

WWDC 2026 ( Image Credit : AI )

  • WWDC 2026లో కొత్త అప్‌డేట్స్.. ఐఫోన్ 11 యూజర్లకు లక్కీ ఛాన్స్!
  • సిరి ఏఐతో iOS 27 అప్‌డేట్, ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్టు
  • iOS 27 సపోర్ట్ చేసే ఐఫోన్ మోడళ్ల ఫుల్ లిస్ట్

WWDC 2026 : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆపిల్ వార్షిక WWDC 2026 ఈవెంట్‌లో iOS 27, సిరి ఏఐ, ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి కీలక ప్రకటనలు చేసింది. ఈ మెగా ఈవెంట్ జూన్ 8న ప్రారంభమైంది.

కొత్త అప్‌డేట్‌తో అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఫాస్ట్ ఎయిర్‌డ్రాప్, ఏఐ స్మార్ట్ సిరిని అందిస్తోంది. ఆపిల్ అన్నింటికన్నా ముఖ్యంగా, iOS 27 అప్‌డేట్ రిలీజ్ చేసింది. ఈ అప్‌డేట్ పాత ఐఫోన్ 11 సిరీస్ నుంచి ఆపై వెర్షన్ డివైజ్‌లకు అన్నింటికి అందుబాటులో ఉంటుంది.

ఐఫోన్ 11లో iOS 27 అప్‌డేట్ :
ఆపిల్ ప్రకారం.. iOS 27 ఇప్పటివరకు వచ్చిన iOS అప్‌డేట్‌లలోకెల్లా అత్యంత అడ్వాన్స్ అప్‌డేట్. ఐఫోన్ 11 సిరీస్ నుంచి రాబోయే ఐఫోన్ 18 మోడల్స్ వరకు అన్ని ఐఫోన్లలో ఈ అప్‌డేట్‌ సపోర్టు చేస్తుంది.

Read Also : Samsung Galaxy S25 Ultra 5G : ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ అల్ట్రా 5Gపై రూ. 37,510 తగ్గింపు.. అమెజాన్‌లో జస్ట్..!

ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మాక్స్, ఐఫోన్ SE 2వ జనరేషన్, ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15, ఐఫోన్ 16, ఐఫోన్ 17, కొత్త ఐఫోన్ 18 సిరీస్ యూజర్లు కూడా కొత్త సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. లక్షలాది మంది పాత ఐఫోన్ యూజర్లు కొత్త ఫోన్ కొనాల్సిన అవసరం ఉండదు. లేటెస్ట్ ఫీచర్లు, సేఫ్టీ అప్‌డేట్‌లు పొందవచ్చు.

iOS 27 సపోర్ట్ చేసే ఐఫోన్ మోడళ్ల ఫుల్ లిస్ట్ :

  • ఐఫోన్ 11
  • ఐఫోన్ 11 ప్రో
  • ఐఫోన్ 11 ప్రో మాక్స్
  • ఐఫోన్ SE
  • ఐఫోన్ SE (2వ జనరేషన్ ప్లస్)
  • ఐఫోన్ 12 మినీ
  • ఐఫోన్ 12
  • ఐఫోన్ 12 ప్రో
  • ఐఫోన్ 12 ప్రో మాక్స్
  • ఐఫోన్ 13 మినీ
  • ఐఫోన్ 13
  • ఐఫోన్ 13 ప్రో
  • ఐఫోన్ 13 ప్రో మాక్స్
  • ఐఫోన్ 14
  • ఐఫోన్ 14 ప్లస్
  • ఐఫోన్ 14 ప్రో
  • ఐఫోన్ 14 ప్రో మాక్స్
  • ఐఫోన్ 15
  • ఐఫోన్ 15 ప్లస్
  • ఐఫోన్ 15 ప్రో
  • ఐఫోన్ 15 ప్రో మాక్స్
  • ఐఫోన్ 16e
  • ఐఫోన్ 16
  • ఐఫోన్ 16 ప్లస్
  • ఐఫోన్ 16 ప్రో
  • ఐఫోన్ 16 ప్రో మాక్స్
  • ఐఫోన్ 17e
  • ఐఫోన్ 17
  • ఐఫోన్ ఎయిర్
  • ఐఫోన్ 17 ప్రో
  • ఐఫోన్ 17 ప్రో మాక్స్

సిరి, ఆపిల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లు :
టెక్ దిగ్గజం వర్చువల్ అసిస్టెంట్ సిరి, ఆపిల్ ఇంటెలిజెన్స్‌ లో అనేక మార్పులు చేసింది. సిరిని ఏఐ ఫీచర్లతో అడ్వాన్స్ టెక్నాలజీని అందిస్తుంది. ఇప్పుడు, ఆపిల్ ఇంటెలిజెన్స్‌తో యూజర్లు కస్టమైజడ్ ఎక్స్ పీరియన్స్ కోసం ఆపిల్ ఏఐ ఎకోసిస్టమ్‌ను మరింత అప్ గ్రేడ్ చేస్తోంది.

లిక్విడ్ గ్లాస్‌లో అప్‌గ్రేడ్స్ :
ఆపిల్ iOS 27తో కేవలం కొత్త ఫీచర్లతో పాటు పర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్‌పై ఫోకస్ పెట్టింది. కొత్త ఫొటోలు గతంలో కన్నా 70 శాతం ఫాస్ట్ లోడ్ అవుతాయి. అలాగే ఎయిర్‌డ్రాప్ ట్రాన్స్‌పర్ 80 శాతం వరకు స్పీడ్ ఉంటుంది. మల్టీటాస్కింగ్ కోసం సీపీయూ షెడ్యూలర్‌ అప్ గ్రేడ్ అయింది. డిజైన్ పరంగా లిక్విడ్ గ్లాస్ ఇంటర్‌ఫేస్‌లో కొన్ని మార్పులు చేసింది.