Xiaomi 14 Civi : ఫ్లిప్‌కార్ట్‌లో బ్రహ్మాండమైన డీల్.. షావోమీ 17 సీవీపై రూ. 17వేలు డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే?
Xiaomi 14 Civi : షావోమీ అద్భుతమైన ఆఫర్.. షావోమీ 14 సీవీ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఇప్పుడు ఏకంగా రూ. 17వేలు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- May 28, 2026 / 08:30 PM IST
Xiaomi 14 Civi
- షావోమీ 14 సీవీ ఫోన్‌పై 25శాతం డిస్కౌంట్
- ప్రస్తుతం ఈ ఫోన్ రూ. 44,999 ధరకే మీ సొంతం
- 4,700mAh బ్యాటరీ 67W వైర్డ్ ఛార్జింగ్ ఆప్షన్లు
Xiaomi 14 Civi : షావోమీ ఫ్యాన్స్ కోసం మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. కంపెనీ పాపులర్ ఫోన్ షావోమీ 14 సీవీ తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ డీల్‌లో భాగంగా ఈ షావోమీ ఫోన్ 25శాతం తగ్గింపుతో లభిస్తోంది.
షావోమీ 14 సీవీలో 4700mAh బ్యాటరీ ఉంది. కంపెనీ ఇందులో 50MP మెయిన్ కెమెరాను అందించింది. డీఎస్ఎల్ఆర్ (Xiaomi 14 Civi) వంటి ఫొటోలను తీయగలదని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం, ఈ ఫోన్ కొన్ని బెస్ట్ డీల్స్‌ను అందిస్తోంది. షావోమీ 14 సీవీపై బెస్ట్ ఆఫర్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
షావోమీ 14 సీవీ ధర తగ్గింపు :
ఫ్లిప్‌కార్ట్‌లో షావోమీ 14 సీవీ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ రూ. 59,999 ధరతో లాంచ్ కాగా ప్రస్తుతం రూ. 44,999కే లభిస్తోంది. లాంచ్ దగ్గర నుంచి అత్యంత తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్‌పై అసలు ధర నుంచి నేరుగా రూ. 15వేలు తగ్గింపు లభిస్తోంది. కానీ, ఆఫర్ ఇంతటితో ముగియలేదు. కంపెనీ బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది.
బ్యాంకు ఆఫర్ డిస్కౌంట్ :
షావోమీ 14 సీవీ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లు కూడా పొందవచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొంటే అదనంగా రూ. 2,250 తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్‌ను రూ. 17,500 వరకు తక్కువకు కొనేసుకోవచ్చు. తద్వారా ధర రూ. 42,749కి తగ్గుతుంది.
షావోమీ 14 సీవీ స్పెసిఫికేషన్లు :
షావోమీ 14 సీవీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.55-అంగుళాల 1.5K కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 4nm క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ కోసం ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOSపై రన్ అవుతుంది. 67W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 4,700mAh బ్యాటరీతో వస్తుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. షావోమీ 14 సీవీలో బ్యాక్ సైడ్ ఎఫ్/1.63 అపర్చర్ OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందిస్తోంది. షావోమీ 14 సీవీలోని కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi 6, NFC, బ్లూటూత్ 5.4, GPS, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
