Xiaomi 17 Ultra Price : షావోమీ 17 అల్ట్రాపై అదిరిపోయే డీల్.. ఏకంగా రూ.13వేలు డిస్కౌంట్.. ఇలా కొంటే భారీ సేవింగ్!
Xiaomi 17 Ultra Price : షావోమీ 17 అల్ట్రాపై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. యాక్సస్ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ బ్యాంకు, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆఫర్లతో ఎంత సేవ్ చేయవచ్చు? అల్ట్రా ఫోన్ స్పెసిఫికేషన్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- September 9, 2026 / 08:19 PM IST
Xiaomi 17 Ultra price drop
- షావోమీ 17 అల్ట్రా అధికారిక ధర రూ. 1,39,999 మాత్రమే
- అమెజాన్‌లో యాక్సిస్ క్రెడిట్ కార్డు, ఈఎంఐపై రూ. 13వేలు తగ్గింపు
- IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై రూ. 11,200 తగ్గింపు
Xiaomi 17 Ultra Price : ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? ముఖ్యంగా మంచి కెమెరా ఫోన్ కావాలా? ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఫ్లాగ్‌షిప్ ఫోన్ తీసుకోవడం బెటర్.. అందులో షావోమీ 17 అల్ట్రా తీసుకోవచ్చు.
అయితే ఈ ఫోన్ రూ.1,39,999 ధర చూస్తే మాత్రం కొంచెం ఖరీదైన డీల్‌లా కనిపిస్తుంది. అయితే, ఇక్కడే అమెజాన్ అందిస్తున్న అద్భుతమైన (Xiaomi 17 Ultra Price) ఆఫర్ మీకు ధర పరంగా చాలా తగ్గింపు అందిస్తుంది. ఇంతకీ ఈ అదిరే డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
బ్యాంక్ ఆఫర్‌తో ధర మరింత తగ్గింపు :
షావోమీ 17 అల్ట్రాలో అధికారిక ధర రూ.1,39,999గా ఉంది. అమెజాన్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే యాక్సస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ఈఎంఐతో ఏకంగా రూ.13వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఫోన్ ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది.
Read Also : Motorola Razr 50 Ultra : రూ.99,999 ఫోన్ ఇప్పుడు రూ.60 వేలకే! మోటోరోలా రెజర్ 50 అల్ట్రా ఇప్పుడు మరింత చీప్!
యాక్సస్ బ్యాంకు కార్డ్ లేకపోతే ఐడీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డు ఈఎంఐ ద్వారా రూ.11,200 వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాదు, మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా అదనంగా సేవ్ చేసుకునే ఛాన్స్ ఉంది.
కెమెరా అంటే ఇష్టమైతే తప్పక కొనాల్సిన ఫోన్ ఇది.. షావోమీ 17 అల్ట్రాలో 6.9-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్ ఉన్నాయి. పర్ఫార్మెన్స్ కోసం స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను అందించారు. బ్యాటరీ విషయానికి వస్తే.. 6,000mAh బ్యాటరీ, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
కెమెరాలతో ఫొటోగ్రఫీకి ఫుల్ ఫోకస్ :
ఈ ఫోన్‌లో లైకా ట్యూన్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 200MP టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా అందించారు.
మరి కొనాలా? వద్దా? :
కెమెరా క్వాలిటీ, స్పీడ్, డిస్‌ప్లే, బ్యాటరీ పరంగా ప్రీమియం ఫ్లాగ్‌షిప్ కోరుకునేవారికి షావోమీ 17 అల్ట్రా అద్భుతమైన ఆప్షన్. ముఖ్యంగా రూ.13వేలు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.
ఈ ఫోన్ తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. అయితే, బ్యాంక్ ఆఫర్, నిబంధనలేంటో ముందు చెక్ చేశాకే కొనండి..
