Motorola Razr 50 Ultra : రూ.99,999 ఫోన్ ఇప్పుడు రూ.60 వేలకే! మోటోరోలా రెజర్ 50 అల్ట్రా ఇప్పుడు మరింత చీప్!
Motorola Razr 50 Ultra : మోటోరోలా రేజర్ 50 అల్ట్రాపై భారీ ధర తగ్గింపు.. రూ.99,999 లాంచ్ ధర నుంచి ప్రస్తుతం రూ.63,998కే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఎలా పొందాలంటే?
Motorola Razr 50 Ultra
- ఫ్లిప్కార్ట్లో మోటోరోలా రేజర్ 50 అల్ట్రాపై భారీ ధర తగ్గింపు
- బ్యాంక్, కార్డ్ ఆఫర్లతో మరింత ఆదా చేసుకోవచ్చు
- భారీ డిస్ప్లే, పవర్ ఫుల్ ప్రాసెసర్, 50MP కెమెరాలు
Motorola Razr 50 Ultra : కొత్త ఫోల్డబుల్ ఫోన్ కొనాలని చూస్తున్నారా? కానీ, ధర చూసి వెనక్కి తగ్గుతున్నారా? అయితే, మీకోసం మోటోరోలా రెజర్ 50 అల్ట్రాపై భారీ తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం ఈ డీల్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది.
ఒకప్పుడు ప్రీమియం ధరలో టాప్ లిస్టులో ఉన్న ఈ ఫ్లిప్ ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు, సరైన బ్యాంక్ కార్డుతో (Motorola Razr 50 Ultra) కొనుగోలు చేస్తే ఇంకా అదనంగా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పుడు రూ.63,998కే :
మోటోరోలా రెజర్ 50 అల్ట్రా ఫోన్ భారత మార్కెట్లో రూ.99,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో ఈ ఫోన్ రూ.63,998కు లభిస్తోంది. అంటే లాంచ్ ధరతో పోలిస్తే ఏకంగా రూ.36,001 తగ్గింపు అనమాట.
Read Also : Apple Event 2026 : ఐఫోన్ 18 ప్రో ధరలు లీక్.. భారత్లో రూ.1.44 లక్షలా? దుబాయ్, అమెరికాలో ధర ఎంత ఉండొచ్చంటే?
ఈ డీల్ స్పెషాలిటీ ఏంటంటే.. ఫ్లిప్ కార్ట్ ఎస్బీఐ బ్యాంకు, ఫ్లిప్ కార్ట్ యాక్సస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ఆఫర్ ద్వారా మరో రూ.3,200 వరకు తగ్గింపు పొందవచ్చు. అప్పుడు నెట్ ధర సుమారు రూ.60,798కి తగ్గుతుంది.
ఫోన్లో ఏంటి స్పెషల్? :
ఈ రెజర్ 50 అల్ట్రాలో బయట 4-అంగుళాల కవర్ డిస్ప్లే, లోపల 6.9-అంగుళాల డిస్ప్లే ఉన్నాయి. ఇంటర్నల్ స్క్రీన్ 165Hz రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్ చేస్తుంది. గరిష్ఠంగా 2,400 నిట్స్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ కోసం స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 చిప్సెట్, 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ లభిస్తాయి. కెమెరాల్లో 50MP మెయిన్ + 50MP టెలిఫోటో సెటప్ ఉండగా, 2x ఆప్టికల్ జూమ్ కూడా ఉంది.
బ్యాటరీ అదుర్స్ :
ఈ ఫోన్లో 4,000mAh బ్యాటరీ ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్లెస్ ఛార్జింగ్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. మొత్తంగా చూస్తే సుమారు రూ.60,798 ధరలో అద్భుతమైన ఫీచర్లతో ప్రీమియం ఫ్లిప్ ఫోన్ దొరకడం అద్భుతమైన డీల్. అయితే, బ్యాంక్ ఆఫర్లు, స్టాక్, ధరలు మారే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు ఫ్లిప్ కార్ట్ లో లేటెస్ట్ ధరను చెక్ చేశాకే కొనడం బెటర్..
