Redmi Note 15 SE : కొంటే రెడ్‌మి ఫోన్ కొనాలి.. ఈ స్పెషల్ ఎడిషన్ కిర్రాక్ బ్రో.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!
Redmi Note 15 : కొత్త రెడ్‌మి ఫోన్ వచ్చేసింది. లేటెస్ట్ ఏఐ ఫీచర్లు, 5800mAh బ్యాటరీతో రెడ్‌మి నోట్ 15 ఎస్ఈ పూర్తి ఫీచర్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి..
- Sreehari A
- Published On : April 2, 2026 / 07:50 PM IST
Redmi Note 15
- మిడ్ రేంజ్ కొనుగోలుదారులకు పండగే
- రెడ్‌మి నోట్ 15 ఎస్ఈ స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది
- 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5,800mAh బ్యాటరీ సపోర్టు
Redmi Note 15 : భారత మార్కెట్లో షావోమీ రెడ్‌మి నోట్ 15 స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిజైన్, అదిరిపోయే విజువల్స్ స్మార్ట్ ఫీచర్లతో వస్తుంది. యూజర్ల కోసం క్రియేటివిటీ, కనెక్టివిటీతో ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 5,800mAh బ్యాటరీ ఉంది. మీకు రెడ్‌మి నోట్ 15 స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.
రెడ్‌మి నోట్ 15 ఎస్ఈ ధర :
రెడ్‌మి నోట్ 15 ఎస్ఈ ఫోన్ (6GB+128GB) స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999 కాగా, ప్రత్యేక ధర రూ. 19,999గా ఉంది. 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 25,999 కాగా, ప్రత్యేక ధర రూ. 21,999గా ఉంది. 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 27,999 కాగా, ప్రత్యేక ధర రూ. 23,999గా ఉంది.
ఐసీఐసీఐ కార్డ్ పేమెంట్లపై రూ. 2వేలు తగ్గింపుతో బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. వినియోగదారులు 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ పొందవచ్చు. రెడ్‌మి నోట్ 15 ఎస్ఈ ఏప్రిల్ 7, 2026న అమ్మకానికి వస్తుంది. ఈ ఫోన్ షావోమీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.
రెడ్‌మి నోట్ 15 SE ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
రెడ్‌మి నోట్ 15 ఎస్ఈలో FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3200 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ ఎడ్జ్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్‌లో ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఏఐ ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి. రెడ్‌మి నోట్ 15 ఎస్ఈ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇందులో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,800mAh బ్యాటరీ కూడా ఉంది.
కంపెనీ 4 ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 6 నెలల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది. ఈ ఫోన్ క్రిమ్సన్ రిజర్వ్, కార్బన్ బ్లాక్, ఫ్రాస్టెడ్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో డ్యూయల్ స్పీకర్‌లు, క్లియర్ కాల్స్ కోసం ఏఐ ఆధారిత యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నాయి.
గూగుల్ జెమిని, సర్కిల్ టు సెర్చ్ వంటి ఇంటిగ్రేటెడ్ ఏఐ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. కెమెరా సెటప్ విషయానికి వస్తే.. రెడ్‌మి నోట్ 15 ఎస్ఈ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 20MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
ఏఐ ఎరేస్, ఏఐ స్కై, ఏఐ బోకె, ఏఐ బ్యూటిఫై, ఏఐ రిఫ్లెక్షన్ రిమూవల్ వంటి ఏఐ ఆధారిత టూల్స్ ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, డ్యూయల్-సిమ్ సపోర్ట్, Wi-Fi, బ్లూటూత్, NFC, IR బ్లాస్టర్, USB టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP65, IP66 రేటింగ్ అందిస్తుంది. 1.7 మీటర్ల ఎత్తు నుంచి పడినా తట్టుకునేలా MIL-STD-810H సర్టిఫికేషన్ పొందింది. టైటానియం సోలైల్ మన్నికతో వస్తుంది. ఈ ఫోన్ 3D-కర్వ్డ్ డిజైన్‌తో వస్తుంది. 7.35mm మందంతో సుమారుగా 178 గ్రాముల బరువు ఉంటుంది.
