Xiaomi Redmi 9 Power: రెడ్‌మీ9 పవర్, జియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ బ్రాండ్ కు చెందిన కొత్త బడ్జెట్ ఫోన్.. కొవిడ్ సమయంలో సరిగ్గా సరిపోయే ఫోన్. ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు స్ప్లాష్ రెసిస్టెంట్ డిజైన్ తో వైడ్ వైన్ ఎల్1 సర్టిఫైడ్ డిస్ ప్లే, క్యాపబుల్ ప్రోసెసర్. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది ఏంటంటే.. 6,000mAh బ్యాటరీ సామర్థ్యంతో పాటు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు.
ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ ఫోన్ కేవలం రూ.10వేల 999 ప్రారంభ ధరతోనే మార్కెట్లో అందుబాటులో ఉంది. తక్కువ డబ్బుతో చాలా సర్వీస్ ఇస్తున్న ఫోన్. మొత్తం ప్లాస్టిక్ తో వస్తున్న ఫోన్.. వెయిట్ విషయంలోనూ తేలిక ఫీలింగ్ ఇస్తుంది. బ్లాక్, బ్లూ, రెడ్, గ్రీన్ రంగుల్లో మార్కెట్లోకి రానుంది.
బ్యాటరీ పెంచినంత మాత్రాన వెయిట్ పెరుగుతుందనుకోవడం కేవలం అపోహ మాత్రమేనని ఫోన్ నిరూపించింది. కేవలం 9.6మి.మీల పొడుగు పెంచడంతో 200గ్రాముల అదనపు బరువు చేరిందంతే. ఈ ఫోన్ తో సింగిల్ ఛార్జి్ చేసుకుంటే రెండ్రోజులకు సరిపడ ఛార్జింగ్ వచ్చినట్లే. బ్యాటరీ లైఫ్ స్పాన్ కూడా పెరిగినట్లే.
53-inch IPS LCD display full-HD resolution
stereo speakers
Qualcomm Snapdragon 662 processor
4GB RAM, 128GB storage
48MP + 8MP + 2MPలతో పాటు 8MP ఫ్రంట్ camera
రెడ్ మీ9 పవర్ బేస్ మోడల్ ఫోన్ 4GB/64GBలతో Rs 10,999కే అందుబాటులో ఉండగా 4GB/128GBకెపాసిటీ ఫోన్ Rs 11,999గా ఉండనుంది. ఈ ఫోన్ ఎమ్ఐ.కామ్/ఇన్, అమెజాన్ ఇండియా, ఎమ్ఐ హోమ్స్, ఎమ్ఐ స్టూడియోస్ లలో రిటైల్ స్టోర్లలో డిసెంబర్ 22 తర్వాత నుంచి అందుబాటులోకి రానుంది.