Apple iPhone 16 : వావ్.. ఇది కదా డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 అతి చౌకైన ధరకే.. ఇలా కొన్నారంటే?

Apple iPhone 16 : ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త ఐఫోన్ 16 మోడల్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ అసలు వదులుకోవద్దు. ఐఫోన్ ఇంత తక్కువకు మళ్లీ దొరక్కపోవచ్చు..

buy Apple iPhone 16

  • ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 మోడల్ రూ. 60వేల లోపు ధరకే లభిస్తుంది
  • ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్లతో మరింత తగ్గింపు పొందవచ్చు
  • A18 చిప్, 48MP కెమెరా, 6.1-అంగుళాల OLED డిస్‌ప్లే సెటప్

Apple iPhone 16 : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మీరు రూ. 60వేల లోపు ధరలో కొత్త ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. మీరు ఐఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనుకుంటే ఇది మీకోసమే.. ఫ్రీడమ్ సేల్‌కు ముందు ఐఫోన్ 16ను గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. సుమారు రూ. 70వేల విలువైన ఐఫోన్ (Apple iPhone 16) ప్రస్తుతం రూ. 60వేల లోపు ధరకే లభిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 16ను అత్యంత తక్కువ ధరకు ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ధర ఎంతంటే? :
సాధారణంగా రూ. 69,900 ధర ఉండే ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ ప్రస్తుతం రూ. 64,900కే లభిస్తోంది. నేరుగా రూ. 5వేలు తగ్గింపు పొందవచ్చు. అంతేకాదు.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ లేదా ఎస్‌బీఐ కార్డుతో అదనంగా రూ. 5,145 సేవ్ చేసుకోవచ్చు. తద్వారా ధర రూ. 59,755కు తగ్గుతుంది.

మీ దగ్గర పాత ఫోన్ ఉంటే పర్ఫార్మెన్స్ వేరియంట్, ఇతర అంశాలను బట్టి ఫ్లిప్‌కార్ట్ రూ. 43,650 వరకు పొందవచ్చు. ఈ ఐఫోన్ ఈఎంఐలో కొనాలని చూస్తుంటే నెలకు రూ. 2,282 నుంచి ఈజీ ఈఎంఐ ఆప్షన్లతో కొనేసుకోవచ్చు. అదనంగా ఎక్స్‌టెండెడ్ వారెంటీలు, ఇతర బెనిఫిట్ వంటి యాడ్-ఆన్‌లను కూడా పొందవచ్చు.

Read Also : Top 5 Upcoming Smartphones : ఐఫోన్‌కు గట్టి పోటీ.. బడ్జెట్ నుంచి ఫ్లాగ్‌షిప్ వరకు.. ఆగస్టులో రానున్న టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు మిస్ కావొద్దు!

ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 460ppi వద్ద 2556 x 1179 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ప్యానెల్ 60Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఈ ఐఫోన్ ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, ఆపిల్ సరికొత్త జనరేషన్ సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ అందిస్తుంది. ఇందులో యాక్షన్ బటన్, కెమెరా కంట్రోల్ కెపాసిటివ్ సెన్సార్ ఉన్నాయి.

ఐఫోన్ 16 మోడల్ 3nm ప్రాసెస్‌పై ఆపిల్ A18 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 8GB ర్యామ్, 128GB, 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ 3,561mAh బ్యాటరీతో వస్తుంది. 22 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుందని ఆపిల్ పేర్కొంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌లో సెన్సార్-షిఫ్ట్ OIS, 2x ఆప్టికల్-క్వాలిటీ టెలిఫోటో జూమ్‌తో 48MP ఫ్యూజన్ ప్రైమరీ కెమెరా, అలాగే ఆటోఫోకస్, మాక్రో సపోర్ట్, 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 4K వీడియో రికార్డింగ్, ఫేస్ ఐడీకి సపోర్ట్ చేసే 12MP ట్రూడెప్త్ కెమెరా కూడా ఉంది.